- Advertisement -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి
Teacher dies in road accident
శ్రీకాకుళం
కోటబొమ్మాళి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని సంపతిరావు త్రివేణి (31) మృతి చ,ఎందారు. ఆమదాలవలస తిమ్మాపురం గ్రామానికి చెందిన ఈమె కోటబొమ్మాలి నుంచి టెక్కలి వైపు స్కూటీపై వెళ్తండాగా పాకివలస వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలి వైపు నుంచి నరసన్నపేట వైపు వెళ్లున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, పక్క రోడ్డులో వెళ్తున్న త్రివేణిని ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు ,టెక్కలి మండలం సన్యాసిపేట లో ఎస్జీటీ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ లో తిరుపతి జిల్లా వరదయ్య పాలెం నుంచి వచ్చారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలున్నారు.
- Advertisement -