Wednesday, May 20, 2026

బీడీ కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి టేకుమల సమ్మయ్య

- Advertisement -

బీడీ కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి టేకుమల సమ్మయ్య

Tekumala Sammaiah, make the state congresses of beedi workers a success

ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి

చొప్పదండి

తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఈ నెల 30 ,31 తేదీల్లో రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని మహాసభల” వాల్ పోస్టర్” ను  కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తాలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని బీడీ కార్మికులకు కనీసం వేతనాల జీవో అమలు చేయాలని దేశవ్యాప్తంగా అనేక రకమైన  వేతనం ఇవ్వాలని బీడీ పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయాలని  కార్మికులకు నెలకు 26 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు.మంచి నాణ్యమైన బీడీ ఆకును సరఫరా చేయాలని అలాగే కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా అర్హులైన పేద బీడీ కార్మికులకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని అన్నారు.ఈపీఎఫ్ సంస్థలు బీడీ కార్మికులు రాజీనామా చేసిన అనంతరం కనీసం పెన్షన్ నెలకు 6000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ఆసుపత్రికి అధిక నిధులు కేటాయించి కార్మికులకు మెరుగైన వైద్య మెరుగైన వైద్య సౌకర్యం అందించి అన్ని టెస్టులు ప్రభుత్వమే చేయాలని కార్మికుల  ప్రసూతికి ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరారు. వారి పిల్లలకు స్కాలర్షిప్ సంక్షేమ పథకాలు అందించే విధంగా ఉండాలని కార్మికులు పనిచేస్తున్నారని పనిచేసిన కూలీ డబ్బులు బ్యాంకు ఖాతాలో కాకుండా నేరుగా కంపెనీ ద్వారా చేతికి  అందించాలని సూచించారు. దీనితోపాటు  ప్రతి జిల్లా కేంద్రంలో  బీడీ కార్మికుల కోసం ప్రత్యేక హాస్పిటల్  కట్టించి వైద్య సౌకర్యం అందించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతి బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని  కార్మికులకు 2016 నుండి 4016 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ ,జిల్లా జిల్లా నాయకులు పవన్, బీడీ సంఘం జిల్లా కన్వీనర్ వేముల శంకరమ్మ, నాయకురాలు కట్ల వసంత, శవంతులు లక్ష్మి ,పడాల రేణుక, తాళ్ల అనిత, బల్లాల లక్ష్మి ,జంగం లక్ష్మి, అల్లం పుష్ప, బీడీ కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్