తెలంగాణ ఉద్యమకారిణి వీర వనిత చాకలి ఐలమ్మ

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారిణి వీర వనిత చాకలి ఐలమ్మ

Telangana activist Veera Vanita Chakali Ailamma

సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల,
తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్థంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ అని కొనియాడారు. బహుజన ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని, నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి, కృషి గురించి కలెక్టర్ తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతి రోజులను కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ భావితరాలకు ఆమె  స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు..ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular