Sunday, September 8, 2024

సంక్షోభంలో తెలంగాణ వ్యవసాయం కేటీఆర్

- Advertisement -

సంక్షోభంలో తెలంగాణ వ్యవసాయం
కేటీఆర్
హైదరాబాద్
తెలంగాణ  ముఖ్యమంత్రి,  ఈ ప్రభుత్వం రాజకీయాలను మాత్రమే తమ ప్రాధాన్యతగా తీసుకుంది. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంలో పడింది. రైతన్నలు తీవ్ర కష్టాల్లో బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.బుధవారంఅయన మీడియాతో మాట్లాడారు.  రైతులు తమ ధాన్యం ప్రభుత్వం  కొంటలేదని  బాధపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వారి పరిస్థితి దయనీయంగా ఉంది.  తమ ధాన్యం కొనే నాథుడు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం కావటం, అకాల వర్షాలు కురుస్తుండటంతో మొత్తం ధాన్యం వర్షాల పాలవుతోంది.  ధాన్యం కొనుగోలు చేసే అధికారి లేకపోవడం… కొనుగోలు చేయాలని ఆదేశించే ప్రజాప్రతినిధి లేకపోవడంతో రైతన్నలు తీవ్ర నష్టాల పాలవుతున్నారని అన్నారు. 25 రోజులైన కూడా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో కొనే పరిస్థితి లేదు.  ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. ఎన్నికల అయిపోయిన నేపథ్యంలో రాజకీయాలను పక్కనపెట్టి రైతన్నలను ఆదుకోవాలి. ధాన్యం తరుగు విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో రైతుకు అన్యాయం చేయకుండా తరుగు లేకుండా రైతన్నలకు న్యాయం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలు ఆందోళనలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో  ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నాలు,  రాస్తారోకోలు నిరసనలు చేస్తున్నారు.  ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి తన బాధ్యతను నిర్వహించి ధాన్యం కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలి. ఈ ప్రభుత్వం స్పందించకుంటే రైతన్నల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ ఎక్కాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.  రైతులకు  బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ అధినాయకుడు కేసీఆర్ అండగా ఉంటారు. మీ ధాన్యం కొనుగోళ్లతో పాటు 500 రూపాయల అదనపు బోనస్,  రుణమాఫీ జరిగే వరకు రైతుల కోస పోరాటం చేస్తామని అన్నారు.
వరంగల్- ఖమ్మం -నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతిసారి మా పార్టీనే గెలిచింది. ఈ మూడు జిల్లాల్లోని విద్యావంతులు తిరిగి మరొకసారి మా పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి గెలుపు కట్టబెడతారని నమ్మకం ఉంది. మా అభ్యర్థి  రాకేష్ రెడ్డి బిట్స్ పిలానిలో ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన విద్యావంతుడు, ఉత్సాహవంతుడు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మోసం చేసిన తీరును ఈ మూడు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల 70 వేల నిరుద్యోగ యువత గుర్తించాలి.   50 వేల పోస్ట్ లతో మెగా డీఎస్సీ అని చెప్పి దగా చేసిన తీరును నిరుద్యోగులు ఇప్పటికే గుర్తించారు. మేము గతంలో ఇచ్చిన డీఎస్సీ నే ఈ ప్రభుత్వం  మరోసారి తిరిగి ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ అన్నారు.  దానిపైన ఇప్పటిదాకా ఏ విషయాన్ని తేల్చటం లేదు.  గతంలో పరీక్షలకు ఎలాంటి ఫీజులు తీసుకోమని చెప్పి ఈరోజు ప్రతి విద్యార్థి నుంచి రూ. 2 వేలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు,  యువకులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రశ్నించేలా మా అభ్యర్థి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు. యువకులు నిరుద్యోగులను కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగడతారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్