0.1 C
New York
Wednesday, February 21, 2024

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది

- Advertisement -

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది
ఖమ్మం
ప్రభుత్వ పథకాలు ఇవ్వడంలో మంత్రులు ఎందుకు తడబడుతున్నారని ఎమ్మెల్సీ తాత మధుసుధన్ ప్రశ్నించారు.సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు అయింది. బి.ఆర్.ఎస్ పార్టీ కంటే మేము మెరుగ్గా పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. ప్రజలకు చెప్పిన మాటలను మేము రిపీట్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏమీ ప్రకటించిందో యువత గమనించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ భట్టి విక్రమార్క మేము అలా అనలేదు అంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఇవ్వడంలో ఎందుకు తడబడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న బి.ఆర్.ఏస్ ప్రభుత్వంలో రైతు బంధు సరైన సమయంలో వేశామని అన్నారు.
ఎన్నికల ముందు రైతు బంధు ఇవ్వద్దని ఎన్నికల కమిషన్ కు లెటర్ ఇచ్చారు. జనవరి నెల పెన్షన్లు కూడా ఇంతవరకు రాలేదు. 4,000 కాదు మేము ఇంతకు ముందు ఇచ్చిన 2,000 ఇవ్వండి అని అడుగుతున్నము. ఫ్రీ కరెంట్ కాదు ముందు కట్టింగ్ లేకుండా కరెంట్ ఇవ్వండి. పక్క రాష్ట్రం వాళ్ళ బూతుల సంస్కృతి తీసుకు వచ్చారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి బూతులు మాట్లాడే కొత్త సంస్కృతి తీసుకొచ్చాడు. కేసీఆర్ ను రాండ్రా అని పిలుస్తున్నాడు. చంద్రబాబు నీకు ట్రైనింగ్ ఇచ్చిన వాడేగా. చంద్ర బాబు ఎప్పుడన్నా అలా మాట్లాడమని చెప్పాడా అని ప్రశ్నించారు.
నిన్ను మాట్లాడమని ఆయన నీకు చెప్పాడా. కాంగ్రెస్ బాధ్యతలు తప్పించుకోవడం కోసం బి.ఆర్.ఏస్ మీద బురద చల్లుతున్నరు. పద్మశ్రీ, పద్మ విభూషణలు వచ్చాయని ప్రముఖులకు సన్మానాలు చేశారు. రాజకీయ నాయకులు అన్ పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడకూడదని వెంకయ్య నాయుడు చిరంజీవి ముఖ్యమంత్రికి చురకలు అంటించారు. తెలంగాణ కోసం నువ్వు కొట్లాడలేదు. తెలంగాణ కోసం కొట్లడిన వారిని కొట్టించినవని అన్నారు.
చంద్ర బాబు నాయుడుతో కేసీఆర్ అంటకాగినడు  అంటున్నావు. చంద్ర బాబు సారథ్యంలో నువ్వు ట్రైనింగ్ అయ్యావు. కేసీఆర్ గదిలో కోటల్లో ఉన్నాడు వందల ఏకరల్లో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు అన్నారు. మరి మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు అదే కోటలో ఉంటున్నాడు. బి.ఆర్.ఏస్ ప్రభుత్వంలో నర్స్ పోస్టులు ఇచ్చాము. ఎన్నికల కోడ్ వల్ల వాయిదా పడ్డాయి. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల తరువాత దేశంలో కాంగ్రెస్ కనుమరుగవుతుంది. కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో ఉంది.. ఉత్తర ప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలవదని అన్నారు.
పక్క రాష్ట్రంలో అరాచక పాలన ఉన్నది. అక్కడి లెక్క.. ఇక్కడ కూడా అరాచక పాలన చేస్తున్నారు. మీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదు బి.ఆర్.ఏస్ పార్టీ. రాబోయే రోజుల్లో మీ ఆశలు నెరవెరక పోతే తెలంగాణ ప్రజలతో మేము ఉంటామని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!