Wednesday, April 23, 2025

ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ*

- Advertisement -

నేటి నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు*

ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ*
Telangana government releases SC classification GO, categorizes sub-castes into 3 groups*
*హైదరాబాద్* ఎస్సీ వర్గీకరణపై తెలంగాణలో సోమవారం నాడు కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీఓను విడుదల చేసింది. మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించారు. విద్య, ఉద్యోగాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్‌-1గా, మధ్యస్తంగా లబ్ధిపొందిన కులాలను గ్రూప్‌-2గా, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్‌-3లో చేర్చినట్లు ఎస్సీ వర్గీకరణ జీవోలో పేర్కొన్నారు. గ్రూప్ ఏలో ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్, గ్రూప్ బీ లో ఉన్న వారికి 9 శాతం, గ్రూప్ సీలో ఉన్న వారికి 5 శాతంగా రిజర్వేషన్ అమలు చేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

 

ఏప్రిల్ 14 తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీని అమల్లోకి తీసుకువ స్తూ ఉత్తర్వులు నిబంధ నలు జారీ కానున్నాయి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజు న వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది, ఎస్సీ ఉప కులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది దీనితో ఎస్సి ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమలుకు రానున్నాయి, ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజిక రంగ విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూపు 1 కింద ఒక శాతం, మద్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలకు గ్రూప్ 2 కింద 9% గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉప కులాలను గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది.. అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో భేటీ అవుతుంది. ఉత్తర్వులను విడుదల చేసిన అనంతరం మంత్రులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందిస్తారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గమనార్హం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్