- Advertisement -
తెలంగాణ మధ్యాహ్న భోజనం వర్కర్లు సమస్యలు పరిష్కరించాలి
Telangana mid day workers problems should be solved
మధ్యాహ్న భోజన కార్మికులు
జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా
జగిత్యాల
తెలంగాణ మధ్యాహ్న భోజనం వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు..మంగళవారంటోకెన్ సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బతుకమ్మ ఆడుకుంటూ నిరసన ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గత ఎన్నేళ్ల నుంచి నిరసన, ధర్నాలు, దీక్షలు చేపట్టినప్పటికీ గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తుందని అన్నారు.కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన మధ్యాహ్న భోజన కార్మికులకురూపాయలు 10 వేలు వేతనము చెల్లించే విధంగా జీవో తీసి వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. కోడిగ్రుడ్లు ప్రభుత్వమే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రస్తుతం ఇస్తున్న మెనూ చార్జీలు సరిపోవడం లేదని మోను చార్జీలు రూ. 25 లకు పెంచాలని అదేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్, వంట సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేసే విధంగా చేయాలని కోరారు. వంట, కోడిగ్రుడ్లు, రాగి జావ, అల్పాహారము 5 నెలల నుండి పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు నాయకులు సుతారి రాములు, ఎండి ముక్రం, హనుమంతు, వెన్న మహేష్, దేవదాస్, కిరణ్ కుమార్,సరస్వతి శారద, లక్ష్మి, జమున, పాల్గొన్నారు
- Advertisement -