Sunday, September 8, 2024

తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోంది

- Advertisement -

తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోంది
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ
జగిత్యాల
జగిత్యాలలో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ  ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల నగారా మోగింది. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. వికసత భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. 400 దాటాలి… బీజేపీకి ఓటు వేయాలి. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అని నినదిస్తున్నారు. తనకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తోంది. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నాం. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోంది.  నేను భారతమాతకు పూజారినని అన్నారు.
శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకంగా అని చెప్పారు. శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా..? శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్ను తాను స్వీకరిస్తున్నానని అన్నారు.
శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4 న తెలుస్తుంది. తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల.  ఆంగ్లేయులు, రజాకార్లపై తెలంగాణ సమాజం విరోచిత పోరాటం చేసింది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను దోచుకుంది.  ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుంది.  తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోంది. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసు.  బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోందని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అయిపోతుంది. తెలంగాణ కలలను కాంగ్రెస్, బీఆర్ఎస్లు నాశనం చేశాయి. ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ చెలగాటం ఆడిందని అన్నారు.
అధికారంలోకి రాకముందు అనేక మాటలు మాట్లాడిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం సహా దేనిపైనా విచారణ చేయడం లేదని అన్నారు.  జగిత్యాలలో జరిగిన రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పసుపు ధరను క్వింటాల్ కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు పెంచామని అన్నారు. ఇక్కడి ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి. మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్ల తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేస్తాం. తెలంగాణలో రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తాం. తెలంగాణలో బిజెపి ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయి. మాకు అధికారం కాపుడుకోవడం కన్నా.. ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యం. తెలంగాణలో బిజెపి అధికారంలో ఉంటే.. ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే.. మోడీని తిట్టడం ప్రారంభిస్తున్నారు.
అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహం బయటపడింది.
తెలంగాణను దోచుకున్న వారిని తాము విడిచిపెట్టేది లేదు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకు రాజకీయాలు చేస్తున్నాయి. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయని అన్నారు.
2 జి స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. అది కుటుంబ పార్టీ. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు బయటకు వచ్చింది. అది కుటుంబ పార్టీ. ఇప్పుడు ఆ జాబితాలో కుటుంబ పార్టీ బిఆర్ఎస్ చేరింది. కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ కాళేశ్వరంలో అవినీతి చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలోనూ బీఆర్ఎస్ కు చెందిన నాయకులు అవినీతికి పాల్పడ్డారు.  కేవలం ఆ రెండు పార్టీలు బీజేపీని, మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎంత కవర్ ఫైర్ చేసినా.. తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టబోం. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయం చేస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన బీఆర్ఎస్.. లిక్కర్ స్కామ్లోనూ కమీషన్లు తీసుకుంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు వారి అవినీతి కొనసాగింది. బీజేపీకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. జూన్ 4న ఎన్డీయేకు 400 సీట్లు దాటాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్