పారిస్ ఒలింపిక్స్ కు తెలంగాణ అధికార బృందం

- Advertisement -

పారిస్ ఒలింపిక్స్ కు తెలంగాణ అధికార బృందం
హైదరాబాద్ ఆగష్టు 5

Telangana official team for Paris Olympics

ప్యారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ 2024 ను సందర్శించేందుకు తెలంగాణ అధికార బృందం ఈరోజు బయలుదేరింది.ఎం రేవంత్ రెడ్డి  గారి ఆదేశాల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి నేతృత్వమ్ లో ప్రభుత్వ సలహాదారులు( క్రీడలు) జితేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, వి సి &ఎండీ   ఏ. సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్,  ఎన్ .ప్రకాష్ రెడ్డి ఐపీఎస్, కేంద్ర మాజీ మంత్రి ఎస్ వేణుగోపాల చారి, మరియు ఎం రవీందర్ రెడ్డిలు ఈ బృందంలో ఉన్నారు. క్రీడా స్టేడియాల సందర్శన, ఒలంపిక్స్ పోటీలకు చేసిన ఏర్పాట్లు, భవిష్యత్తులో ఒలంపిక్స్ నిర్వహణకు ఉన్న అవకాశాల పరిశీలన, వివిధ దేశాలు క్రీడల్లో అభివృద్ధి సాధించడానికి అనుసరిస్తున్న  విధానాలు, తకాల పట్టికలో వివిధ దేశాలు ముందంజలో ఉండడానికి దోహదం చేస్తున్న కారణాలు పరిశీలించ దానికి తెలంగాణలో అత్యుత్తమ క్రీడా విధానాన్ని తీసుకురావడానికి ఈ క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.ఈ పర్యటన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశిస్తున్న క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఉపయోగపడేటట్లు, మన రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలకు దారితీస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి బిసి అండ్ ఎండి శ్రీమతి ఏ సోనీ బాలాదేవి  లు అభిప్రాయపడ్డారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular