దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ రిలీజ్
‘Tella Pori…’ Lyrical Song Released from the Movie ‘Deewana’
“దీవాన” వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది. “దీవాన” సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘ఇది ప్రేమా .. ఇది ప్రేమా..’ ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ ‘తెల్లపోరి…’ని మేకర్స్ రిలీజ్ చేశారు.
తెల్లపోరి…’ పాటను సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ స్వరపర్చి, సాహిత్యాన్ని అందించి పాడటం విశేషం. ఈ పాటకు ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్షన్ మంచి జస్టిఫికేషన్ ఇస్తోంది. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది..తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది., మెత్తమెత్త బుగ్గలు, పందిపిల్ల పెదవులు, గింతకంటే క్యూటు పిల్ల యాడ ఉంటది, బ్రష్ చేస్తున్నా, ఫ్లష్ చేస్తున్నా, గా పిల్ల మొఖమే తిరుగుతుంటది, నా బండి మీద స్టిక్కర్ ఆమె పేరు మీదే, పాస్ వర్డ్ నెంబర్ అంటే ఆమె బర్త్ డే, ఇంతమంచి ఫీలింగ్ కావాలనంటే లవ్ లోనే శాతనైతదే.. ‘అంటూ ఫన్నీగా ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. పాటలోని కాన్సెప్ట్ లకు యాప్ట్ అయ్యేలా డిజైన్ చేసిన కొరియోగ్రఫీ, డిఫరెంట్ లొకేషన్స్ లో చేసిన పిక్చరైజేషన్ ఈ సాంగ్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి.
ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పటికే సాంగ్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. “దీవాన” సినిమా టీజర్, సాంగ్స్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. యూత్ ఆడియెన్స్ లో “దీవాన” సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై మరియు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు.



