Sunday, September 8, 2024

టెన్షన్ .. టెన్షన్ … టిక్కెటు వస్తుందా..?  రాదా..?  

- Advertisement -

పెద్ద సారు కనికరించారా..?  మోత మోగుతున్న ఫోన్లు.. దెబ్బకు స్వీచ్‌ ఆఫ్‌

తెలంగాణలో మరికొన్ని గంటల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నాయి.. అధికార పార్టీ బీఆర్ఎస్ రానున్న శాసనసభ ఎన్నికల కోసం మొదటి లిస్టును ప్రకటించేందుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ లిస్టు రానుంది. ఈ నేపథ్యంలో ఆశవాహుల్లో, అసంతృప్తుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎవరు పోటీ చేయబోతున్నారనేది గులాబీ దళపతి ప్రకటించనున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఫోన్లు మోత మోగిపోతున్నాయి. ఎందుకనుకుంటున్నారు.. సీటు వస్తుందా..? రాదా..? అనే క్లారిటీ కోసం.. ప్రస్తుతం తెలంగాణ ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న అధికారులతో పాటు గతంలో పనిచేసిన అధికారులకు సైతం ఎమ్మెల్యే అభ్యర్థులు వందలసార్లు కాల్ చేస్తున్నారు. సార్.. మీ రిపోర్టులో మా టికెట్ గురించి ఏ రకంగా ఉందంటూ ఆరాదీస్తున్నారు. ఎమ్మెల్యే ఫోన్ల తాకిడి భరించలేక చాలామంది పొలిటికల్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి ఏర్పడినట్లు పలువురు అధికారులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకేసారి వందకు పైగా అభ్యర్థుల లిస్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారన్న నేపథ్యంలో చాలామంది ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహులు.. తమ పేరు లిస్టులో ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇంటలిజెన్స్ వర్గాలకు ఫోన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫోన్స్ స్విచ్ ఆఫ్.

సర్వేల ప్రకారమే టికెట్లు కేటాయింపు ఉంటుందని గులాబీ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌ రావు డిసైడ్‌ చేశారు. అయితే, ముఖ్యమంత్రి చేయించిన ఇంటెలిజెన్స్ సర్వేలో తమ పనితీరు ఏ రకంగా ఉంది.. టికెట్ వస్తుందా లేదా.? అన్న ప్రశ్నలతో నేతలు అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.. దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేల అభ్యర్థులు కంటిన్యూగా ఫోన్లు చేస్తుండడంతో ఏం చెప్పాలో తెలియక ఇంటలిజెన్స్‌ అధికారులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి ఏర్పడినట్లు పలువురు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ మొదటి అభ్యర్థుల లిస్టు బయటికి వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఫోన్లు మోత మొగుతున్నాయని.. పలువురు అధికారులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

సర్వే రిపోర్ట్‌ ప్లీజ్‌..

సర్వేలకు సంబంధించిన సమాచారం ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర ఉన్న నేపథ్యంలో సర్వేలు ఏ రకంగా ఉన్నాయి.. చివరి ప్రయత్నం ఏమైనా చేసుకోవచ్చా.. అన్న సజెషన్స్ అయినా ఇవ్వండి అంటూ అధికారులను అసంతృప్త ఎమ్మెల్యేలు వేడుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఎవరికి ఏం చెప్పాలో తెలిక తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు చాలామంది నిన్న సాయంత్రం నుంచి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్