ఎస్సీ వర్గీకరణ, కుల గణనను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
Thanks to state government for approving SC classification and caste enumeration
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్
కోరుట్ల,
:గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు ఉద్యమిస్తున్న మాదిగల పోరాటాలు ఫలించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బిసి కుల గణనను ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం కోరుట్లలోని టిపిఎస్ జేఏసీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బోనగిరి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ జస్టీస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను అమోదించిన ప్రభుత్వం ఎస్సీ 59 కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ చేసిందని, బిసి కల గణన సర్వే ను కూడా అమోదం తెలుపుడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కి నిదర్శనమని వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గీకరణ అమలు చేయాలని పేట భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిబ్రవరి 7న లక్ష డప్పులు వేల గొంతుల మహా ప్రదర్శన పిలుపు బాగ పనిచేసిందని, దేశ వ్యాప్తంగా వర్గీకరణ అములు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేట భాస్కర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టిపిఎస్ జేఏసీ జిల్లా అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి, రైతు విబాగం అద్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, జిల్లా ఉపాద్యక్షులు బండారి శంకర్, షాహిద్ మహ్మద్ షేక్, జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెల రాజు, అధికార ప్రతినిధి చిర్ర చందు, పట్టణ అధ్యక్షులు శనిగారపు రాజేష్ నాయకులు పోగుల శేఖర్,గణేష్,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.