Sunday, February 15, 2026

అందుకే ఇంద్రవెల్లిలోనే రేవంత్ మొదటి సభ..

- Advertisement -

అందుకే ఇంద్రవెల్లిలోనే రేవంత్ మొదటి సభ..

మంచిర్యాల, ఫిబ్రవరి 1: ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) వెల్లడించారు..

గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమర వీరుల స్మృతి వననానికి సీఎం భూమి పూజ చేస్తారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడి అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. లక్ష మందితో ఇంద్రవెల్లి సభ జరుగుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు..

అదే సెంటిమెంట్‌తో ఇక్కడ కూడా…

కాగా.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పలు కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అప్పట్లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇంద్రవెల్లి బహిరంగ సభను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు. మరోవైపు ఇంద్రవెల్లి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్