- Advertisement -
ఇచ్చిన హామీలు అమలు చేయాలి..20న చలో హైదరాబాద్
The assurances given should be implemented.. Chalo Hyderabad on 20th
నర్సంపేట:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈనెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పిలుపు నిచ్చాడు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో ఫిబ్రవరి 20 న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా రాజేందర్ మాట్లాడుతూ,ఇందిరమ్మ రాజ్యం ఇంటిట సౌభాగ్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు పద్నాలుగు నెలలు గడుస్తున్న పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందన్నాడు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన ఐదు గ్యారంటీలలో కొన్ని ఇంకా ప్రారంభమే కాలేదని, తెలంగాణ ప్రజల భవిష్యత్తుని బంగారు బాటలో నడిపిస్తామని గొప్పగా చెప్పిన మాటలన్నీ,నీటిమూటలుగా మారాయని విమర్శించాడు.కేసీఆర్ పాలనలో దగా పడిన తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల ఆకాంక్షలకు అద్దం పటే విధంగా పాలిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గత పాలకులు అడుగుజాడల్లో నడుస్తుందన్నారు. అధికారంలోకి రాగానే రైతు బంధు ఎకరానికి 15000 చెల్లిస్తామని,12 వేల రూపాయలు చెల్లిస్తామని ఆడిన మాట తప్పిందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మంజూరు పారదర్శకంగా లేదన్నాడు.తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సర్కార్ 14 నెలల గడిచినప్పటికి 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నాడు.ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న నాలుగు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడంతో పాటు 40 లక్షల నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రంగాల్లో ఉపాధి హామీ కల్పించాలన్నారు. పోడు సాగు చేసుకుంటున్నటువంటి పదిలక్షల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆరు గ్యారెంటీలు ప్రకటించి కొనసాగించడంలో విఫలం చెందారని అన్నాడు.ప్రశ్నించే గొంతుకులను పరిరక్షిస్తామని.ఆరు నెలల కాలం కాకముందే దేశంలో పే ప్రొఫెసర్ జి హరగోపాల్, ప్రగశీల మహిళా సంఘం పిఓడబ్ల్యు సంధ్యతో పాటు వందలాది మంది విప్లవ సంస్థ నాయకులు,కార్యకర్తలపై కుట్ర కేసులు పెడుతున్నారని విమర్శించాడు.గత ప్రభుత్వాల వలె బూటకపు ఎన్కౌంటర్లు నిర్వహిస్తు, ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ చేయడం జీవించే హక్కులు కాల రాయడం కాదాని విమర్శించాడు,ఈ నియంతృత్వ ఫాసిస్టు విధానానికి స్వస్తి చెప్పాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 20వ తేదీన హైదరాబాదులో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్రం అజయ్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా నాయకులు బోగి సారంగపాని,డివిజన్ నాయకులు భద్రజీ,మల్లన్న,గుగులోత్ కిషన్ స్వామి పీ వై ఎల్ జిల్లా నాయకులు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -