- Advertisement -
డివైడర్ ను ఢీకొన్న బైకు..వ్యక్తి మృతి
The bike collided with the divider...a person diedవిజయవాడ
కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై కెసిపి ఫ్లే ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పి ప్లే ఓవర్ గోడను ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23)..ముక్త దుర్గ బాబు (24)గాపోలీసులు గుర్తించారు. కాకినాడ నుండి హైదరాబాదు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, మంచు ప్రభావం, అతివేగం ప్రమాదానికి కారణమని పోలీస్ వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసిన పమిడిముక్కల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -




