Sunday, September 8, 2024

బోడే ఎఫెక్ట్… సీరియస్సేనా

- Advertisement -

అదిలాబాద్, నవంబర్ 8, (వాయిస్ టుడే): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న టైంలో రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి.. టికెట్లు ఆశించి, పార్టీ్ల్లో అసంతృప్తిగా ఉన్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు … ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి, బీజేపీల నుంచి కాంగ్రెస్‌లోకి , కాంగ్రెస్ నుంచి గులాబీపార్టీలోకి మారిపోతున్నారు నేతలు.. కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్న సమయంలో … ఆ పార్టీని సీనియర్లు ఒక్కొక్కరుగా వీడుతున్నారు… ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్ ఆ లిస్టులో చేరిపోయారు.. ఇంతకీ ఆ మాజీ అమాత్యుడు సడన్ గా ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి?
సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి .. వివేక్ అసలు పేరు జీ. వివేకానంద… ఆయన కుమారుడు వంశీలు బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు… ఈ ఇద్దరికీ కూడా కాంగ్రెస్ దాదాపు టికెట్లు ఫిక్స్ చేసిందన్న ప్రచారం జరిగింది.. అయితే వంశీకి ఛాన్స్ ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానం.. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించిన వివేక్ కు మాత్రం చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది ….  దీంతో చెన్నూరు టికెట్ ఆశించిన కాంగ్రెస్ మాజీ మంత్రి బోడ జనార్ధన్ తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీకి రాజీనామా చేశారు… సీఎం కేసీఆర్ సమక్షంలో మందమర్రి బీఆర్ఎస్ సభలో జనార్ధన్ గులాబీ కండువా కప్పేసుకున్నారు…
ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. పార్టీలో సభ్యత్వం లేని మాజీ ఎంపీ వివేక్‌ను తెరపైకి తేవడం అన్యాయమన్నారు … కాంగ్రెస్‌లో కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని.. ఒకే కుటుంబానికి ఎన్ని టికెట్లు ఇస్తారు..? అని ఆయన ప్రశ్నించారు…. వివేక్‌తో పాటు ఆయన సోదరుడు వినోద్‌ను.. ఆ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కచ్చితంగా ఓడిస్తామని బోడ జనార్దన్ శపథం చేశారు … మరోవైపు.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నేత సంజీవ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎన్ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఈ నేతలంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెబల్‌గా పోటీలో ఉండి శ్రీనివాస్ రెడ్డిని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని పార్టీల్లో కామన్‌గా జంపింగ్‌లు, చేరికలు కనిపిస్తుంటాయ్. బీఆర్ఎస్‌లో బోడె పరిస్థితేంటి..? ఇప్పటికిప్పుడు టికెట్ ఇవ్వలేకపోయినా.. రేపొద్దున్న ఈయనకు పార్టీ ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తుందో లేదో చూడాలి మరి …
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా 16 మందితో విడుదలైంది… ఇక సింగల్ డిజిట్ కేండెట్లనే ప్రకటించాల్సి ఉంది … ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ …తాజా లిస్టులో బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి, చెన్నూరు నుంచి జీ.వివేకానంద, బోథ్ నుంచి గజేందర్, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంత రావు, నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ అభ్యర్ధిత్వాలను ఖరారు చేసింది.
అలాగే కరీంనగర్ నుంచి పురుమళ్ల శ్రీనివాస్, పటాన్ చెరు నుంచి నీలం మధు ముదిరాజ్, సిరిసిల్ల నుంచి కొండం కరుణ మహేందర్ రెడ్డి, నారాయణఖేడ్ నుంచి సురేశ్ కుమార్, వనపర్తి నుంచి మెగా రెడ్డి, డోర్నకల్ నుంచి రామచంద్రు నాయక్, ఇల్లందు నుంచి కోరం కనకయ్య అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి.. ఇక  వైరా నుంచి రామ్ దాస్ మాలోత్, సత్తుపల్లి నుంచి మట్ట రాగమయి, అశ్వారావు పేట నుంచి ఆదినారాయణ నుంచి బరిలో ఉంటారు… అదలా ఉంటే అనూహ్యంగా వనపర్తి, చేవెళ్ల , బోథ్ అభ్యర్థులను కాంగ్రెస్ మార్చింది.. వారికి బీ ఫారంలు ఇవ్డానికి నిరాకరించింది… మరి ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్