నెమ్మికల్.ఎస్వీ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారుల ముందే రసాభాస…
మంత్రి వెళ్ళాక కాలర్లు పట్టుకున్న నాయకులు
సూర్యాపేట , సెప్టెంబర్ 30(వాయిస్ టుడే ప్రతినిధి): సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన గృహలక్ష్మీ లబ్ధిదారులకు శనివారం మంత్రి జగదీష్ రెడ్డి మంజూరు పత్రాలను పంపిణీ వెళ్లిన అనంతరం ఫంక్షన్ హాల్లో బిఆర్ఎస్ నాయకులు కొట్టుకున్నారు.
కందగట్ల గ్రామానికి చెందిన ఆ నాయకులు లబ్ధిదారుల ముందే కాలర్ లు పట్టుకున్నారు.అక్కడ జరిగిన సమాచారం ప్రకారం కందగట్ల గ్రామ సర్పంచ్ ముద్దం శేషమ్మ కుమారుడు మధుసూదన్ రెడ్డి ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయడంతో పాటు ఆయన వర్గానికే ఇళ్లను మంజూరు చేశారని పిఎసిఎస్ వైస్ చైర్మన్ బొల్లే జానయ్య స్టేజిపై ప్రశ్నిచడంతో ఊగిపోయిన ఆ నాయకులు తన సహచరులతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు.అంతకు ముందు ఆయా.గ్రామాలకు చెందిన వారు తాము ఇళ్లకు అర్హులమని తెలినప్పటికి తమకు అందలేదని మంత్రి వద్ద మొర పెట్టుకున్నారు.
గృహలక్ష్మీలో అవకతవకలు జరిగాయని బిఆర్ఎస్ నాయకులను నిలదీత…
ఆత్మకూర్(ఎస్) మండలంలోని కొత్త తండా కు చెందిన్న గృహాలక్ష్మి పథకంలో ఇల్లు ఉన్న వారికే కేటాయించారంటూ రోడ్డును అడ్డుగించి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పై తిరగబడిన మహిళలు..అంతకు ముందు పాతర్ల పహాడ్ స్టేజి వద్ద కూడా అర్హులని చెప్పుకొంటున్న వారు రోడ్డుపై ముళ్ల కంపలు వేసి తమ ఆందోళన వెలిబుచ్చారు.