తెగిన రోడ్డు.. లోయ‌లో పడిపోయిన బ‌స్సు

- Advertisement -
The broken road.. the bus that fell in the valley
The broken road.. the bus that fell in the valley

షిమ్లా:ఆగస్టు 12: హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే సుందర్‌నగర్‌ యూనిట్‌ నుంచి ప్రయాణికులతో షిమ్లాకు బయలుదేరిన హిమాచల్‌ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్ బస్సు.. మార్గమధ్యలో మండి జిల్లాలో రోడ్డు తెగిపోవడంతో లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

బస్సు లోయలో పడిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్‌ రక్షణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

వారిలో 12 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular