బెంగళూరు, డిసెంబర్ 1, (వాయిస్ టుడే): కర్ణాటకలో దారుణం జరిగింది. కొడలిపై కోపంతో ఓ అత్త సొంత మనవడినే హత్య చేసింది. కేవలం తొమ్మిది నెలల వయసున్న పసివాడిని గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని గజేంద్ర నగర్ తాలూకాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 22న జరిగింది. విచారణలో సరోజా గూలీ అనే మహిళ తన కోడలు నాగరత్నను ఇష్టకపడకపోవడమే తొమ్మిది నెలల మనవడు అద్విక్‌ని చంపినట్లు వెలుగులోకి వచ్చింది.నాగరత్న తన తల్లిదండ్రుల ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో అద్విక్‌కి జన్మనిచ్చింది. దాదాపు ఆరు నెలల పాటు అక్కడే ఉండి మూడు నెలల క్రితం అత్తగారింటికి తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు. చిన్న వయసులో బిడ్డకు జన్మనివ్వడంతోనే సరోజా, తన కోడలు నాగరత్నపై పగ పెంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ నెల 22న తాను ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లానని, తిరిగి వచ్చే సరికి చిన్నారి కనిపించలేదని, అత్త సరోజాని అడిగితే తగిన సమాధానం చెప్పకపోవడంతో నాగరత్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో సరోజా తన నేరాన్ని అంగీకరించింది. పసికందును గొంతుకోసి చంపేసి ఆ తర్వాత మడ అడవుల్లో పాతిపెట్టినట్లు ఒప్పుకుందని గజేంద్రగఢ్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష కోసం పంపారు. సరోజ బిడ్డకు తినకూడని పదార్థాలు తినిపించేదని నాగరత్న పోలీసులకు వెల్లడించింది. అయినా కూడా తన అత్తగారు ఇంత దారుణానికి ఒడికడతారని ఎప్పుడూ అనుకోలేదని నాగరత్న కన్నీరుమున్నీరైంది.
కోడలిపై కోపంతో మనవడిని గొంతుకోసి చంపిన కసాయి అత్త..
Published By Voice Today Team
181
- Advertisement -
- Advertisement -
- Tags
- burnham murder
- grandma murders grandson
- grandson
- grandson artist
- grandson documentary
- grandson fans
- grandson full set
- grandson interview
- grandson live
- grandson live performance
- grandson music
- grandson tik tok
- harvey murder
- life with murder
- moms that murder
- Murder
- murder case
- murder for hire
- murder over what to watch on tv
- murder stories
- murder trial
- murderer
- new grandson
- solved murder
- son witnessed dad's murder
- tik tok grandson



