బీఆర్ఎస్ పానాల్లో కేంద్రానికి వాటా వుంది
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్
మేడిగడ్డ కట్టింది ఎల్ అండ్ టీ నే…వేరే సబ్ కాంట్రాక్టు కట్టినట్లు పేపర్ లేదు. మేడిగడ్డ కట్టిన ఆ సంస్థకు 4వందల కోట్లు పెండింగ్ నిధులు ఆపామమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. మా మ్యానిెస్టోలో తుమ్మిడిహట్టి ఉంది… ఎన్డీఎస్యే రిపోర్ట్ కు తుమ్మిడిహెట్టి కి సంబంధం లేదు. నెలరోజుల్లో మేడిగడ్డ రిపోర్ట్ వస్తది… రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందిస్తాం. విజిలెన్స్ రిపోర్ట్ అందింది… క్రిమినల్ చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటారు. జరిగిన నష్టానికి ఇరిగేషన్ లో ఉన్న లోన్స్ కేసీఆర్, కేటీఆర్ కట్టాలి. తుమ్మీదిహెట్టి వద్ద నీళ్ళు లేవని సిడబ్ల్యూసీ చెప్పినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేశారు. తుమ్మిడిహెట్టీ వద్ద 160 టీఎంసీ వద్ద ఉన్నాయని సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చినట్లు కేంద్ర ఇరిగేషన్ అధికారి స్వయంగా చెప్పారు. తుమ్మదిహెట్టి వద్ద ప్రాజెక్టు కు అదనపు నిధులు ఖర్చు చేసి ఉంటే 16లక్షల ఆయకట్టుకు ఇప్పటికే నీళ్ళు అందేవి. బీఆర్ఎస్ చేసిన పాపాల్లో కేంద్రం పాత్ర ఉంది. కేంద్రం హామీతో వేల కోట్ల రుణాలు కాళేశ్వరం ప్రాజెక్టు కు వచ్చాయి. నాగార్జున సాగర్ మెంటెనేన్స్ చేస్తాము..సీఆర్పిఎఫ్ బలగాలు తొలగించాలని కోరాం. ప్రాణహిత కోసం వేదిరె శ్రీరామ్ చెప్పిన 11వేల కోట్లలో 6వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మేడిగడ్డ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు…చూసి క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్,బీజేపీ మధ్య అలయబలయ్ లేకపోతే 1లక్ష కోట్ల రుణాలు ఊరికే వస్తాయా? * మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హస్యస్పదంగా ఉంది. మేడిగడ్డ వెళ్తున్న బీఆర్ఎస్ నేతల బస్సు టైర్ బ్లాస్ట్ అయింది…ఇప్పటికే కారు శెడ్డుకు పోయింది. మేడిగడ్డ విచారణ పై కమిటీ వెయ్యడానికి స్వాగతిస్తున్నామని అన్నారు.
బీఆర్ఎస్ పానాల్లో కేంద్రానికి వాటా వుంది
- Advertisement -
- Advertisement -