- Advertisement -
వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్రం..
The center has ignored the agriculture sector.
కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యత దక్కలేదు
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవారి 1
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి పూర్తీ బడ్జెట్ 50,65,345 కోట్లు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. 1,71,437 కోట్లు వ్యవసాయానికి ఇచ్చినట్లే ఇచ్చి అందులో మత్స్య శాఖను కూడా కలిపారు. వాస్తవానికి 1,27,290 కోట్లు మాత్రమే పూర్తి వ్యవసాయ రంగానికి కేటాయించారు. గత బడ్జెట్ కు ఇప్పుడు పెంచింది 5 వేల కోట్లు మాత్రమే. మొత్తం బడ్జెట్ లో కేవలం 2.51 శాతమే కేటాయింపులు జరిగాయి. పప్పులు , వంట నూనెలు, చెక్కర, మాసాల దినుసులన్నీ దిగుమతి చేసుకునే పరిస్థితి. చివరికి పసుపు కూడా పక్కదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొత్త ఆలోచన ఏమి లేదు. చివరికి గ్రామీణ ప్రాంతాలు, పంచాయితీలకు శిక్షణ ఇచ్చే వ్యవస్థ NIRD భారత దేశంలోనే తెలంగాణలోనే వుంది. దాని కోసం 77 కోట్ల కేటాయించాలని ప్రతిపాదన పంపితే ఒక్క పైసా ఇవ్వలేదు.ప్రకృతి వ్యవసాయం వైపు కోటి మంది రైతులను మారుస్తామని గొప్పగా చెప్పి..బడ్జెట్లో 616 కోట్లనే కేటాయించడం బాధాకరం. పోయిన బడ్జెట్ తో పోలిస్తే 100 కోట్లే పెంచారు. మార్కెట్ ప్రకృతి పంటకు డిమాండ్ వుంది. కానీ కేంద్ర సర్కార్ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదు. గ్రామాలల్లో వ్యవసాయ కూలీల కొరత నివారణకు ఏవిధమైనప్రతిపాదన బడ్జెట్లో లేదు. 100 వెనుకబడ్డ జిల్లాలను గుర్తించి పప్పు దినుసులను పండించడానికి ప్రోత్సహిస్తామని గొప్పగా చెప్పి కేటాయింపులు వెయ్యి కోట్లేవున్నాయి. ఇవన్నీ చూస్తుంటే కేవలం కంటితుడుపుగా కనిపిస్తుంది. 2020 లో ఎంత పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం హర్యానా, ఢిల్లీ శివారు ప్రాంతాల్లో జరిగితే రైతుల కోరిక ఒక్కటే ఒక్కటి మినిమమ్ సపోర్ట్ ప్రైజ్ కు చట్టబద్దత కల్పించాలని అడిగారు. అది కూడా ఈ బడ్జెట్లో లేకపోవడం బాధాకరం. ఈ బడ్జెట్ చూస్తుంటే గతంలో ప్రవేశపెట్టిన మూడు నల్లచట్టాలు, దేశమంతటా ప్రైవేట్ మార్కెట్ తేవాలనే విధానం అంతర్గతంగా ఎన్డీయే ప్రభుత్వానికి వ్యవసాయ రంగాన్ని బడా పెట్టుబడిదారులకు అప్పగించాలనే ఉద్దేశం ఈ బడ్జెట్లో కనిపిస్తుంది. రైతు మరియు ఉత్పత్తి వ్యవస్థను ప్రోత్సహిస్తామని చెబుతూ నిధులు కేటాయించకపోవడం బాధాకరం.
- Advertisement -