కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవాలి
The coalition government should keep its word
సిఐటియు మండల కార్యదర్శి పోతురాజు…
డుంబ్రిగూడ
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి బి. పోతురాజు అన్నారు. మండల కేంద్రంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం వాల్ ఇంటర్లు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఇచ్చిన మాట నిలబెట్టాలని వాలంటర్లు పలు నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి పోతురాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో ప్రభుత్వ పథకాలు చేరవేసి ప్రజలకు, ప్రభుత్వానికి వారిదిగా పనిచేశారని, ప్రజలకు అటువంటి సేవలు అందించిన వాలంటీర్లను తొలగించడం సరికాదని చెప్పారు. ఎన్నికల మేని పోస్టులో హామీ ఇచ్చి అధికారంలో వచ్చి ఏడు నెలలు గడుస్తున్న రోజుకో మాట చెప్పి వాలంటీర్లను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. వాలంటర్లను విధుల్లో తీసుకోవాలని, ఇప్పటివరకు బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర ఆందోళన చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సత్యనారాయణ మండల వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.