తీగల వంతెన నిర్మించిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టి కేసు నమోదు చేయాలి.

- Advertisement -

నాసిరకం పనులు జరుగుతున్నపట్టించుకోని మంత్రి గంగుల కమలాకర్.

కోట్ల రూపాయల ప్రజాధనం వృధాపై  మంత్రి గంగుల కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలి

 సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు.

the-contractor-who-built-the-cable-stayed-bridge-should-be-blacklisted-and-a-case-registered
the-contractor-who-built-the-cable-stayed-bridge-should-be-blacklisted-and-a-case-registered

కరీంనగర్ నగరంలో నిర్మించినటువంటి పూర్తిగా నాసిరకం పనులు జరిగాయని గత నెల రోజుల్లోనే రెండుసార్లు అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల అవినీతి వల్లే ఈ యొక్క వంతెన నిర్మాణం పూర్తిగా నాసిరకం జరగడం వల్ల రోడ్డు పాడైపోవడం జరిగిందని వారు ఆరోపించారు.

బుధవారం రోజన తీగల వంతెన ను కసిరెడ్డి సురేందర్ రెడ్డి,, పైడిపల్లి రాజులు సందర్శించారు.

ఈ సందర్భంగావారు మాట్లాడుతూ దాదాపు 181 కోట్ల  వ్యయంతో 2017 డిసెంబర్లో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వంతెన నిర్మాణానికి ఐదు సంవత్సరాలు పట్టిందని నిర్మాణ సమయం పెరగడంతో అంచనా వ్యయానికి మించి  224 కోట్లతో వంతన నిర్మాణాన్ని పూర్తి చేశారని వారు తెలిపారు.

కరీంనగర్ తీగల వంతన పై ప్రయాణం ప్రమాదంగా మారిందని తారు లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వన్ వే  మాత్రమే వాహనాల అనుమతిస్తున్నారని ఒక రోడ్డును మూసివేసారని అన్నారు.

the-contractor-who-built-the-cable-stayed-bridge-should-be-blacklisted-and-a-case-registered
the-contractor-who-built-the-cable-stayed-bridge-should-be-blacklisted-and-a-case-registered

అధికారులు ప్రజాప్రతినిధుల అవినీతి చేతివాటం వల్ల రోడ్డు పలుమార్లు పాడైపోయిందని దీనికి పూర్తి బాధ్యత మంత్రి గంగుల కమలాకర్ వహించాలనిపేర్కొన్నారు.

అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం వల్లే పలుమార్లు తీగల వంతెన పాడైపోయిందని వారు విమర్శించారు.

నిర్మించిన నెల రోజుల్లోనే సైడ్ వాల్ ట్రాక్ పాడైపోయిందని అప్రోచ్ రోడ్డు కృంగిపోవడం జరిగిందని నిర్లక్ష్యాన్ని కప్పించుకునేందుకు పైపై మెరుగులు దిద్దారని వారు ధ్వజమెత్తారు.

అధికారుల నిర్లక్ష్యం పూర్తిగ కనబడుతుందని దీనికి బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కాంట్రాక్టర్ బ్లాకు లిస్టులో పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో తీగల వంతెన నాసిరకం పనులపై కాంట్రాక్టర్ ప్రజాప్రతినిధుల అవినీతిపై ఆందోళన చేపడుతామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular