Friday, February 13, 2026

వర్షం మిగిల్చిన నష్టం..

- Advertisement -

వర్షం మిగిల్చిన నష్టం..

The damage left by the rain..

సాయం కోసం రైతున్నల ఎదురుచూపులు..
నష్టం పరిశీలనలో ఆలస్యంపై రైతుల ఆగ్రహం
హన్మకొండ
హన్మకొండ జిల్లా నడికూడ మండలం: గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు.. అన్నదాతలకు అపార పంట నష్టాన్ని మిగిల్చాయి. సాయం చేసి ఆదుకోవాలని రైతన్నలు ఎదురుచూస్తూ దిగులుచెందుతున్నారు. వానకాలం ప్రారంభం నాటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఆశించినంత మేరకు వర్షాలు కురవలేదు. ఇటీవల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువడంతో చెరువులు, కుంటల్లో నీళ్లు చేరాయి. కాగా, పంటలు నీట మునగడంతో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని నడికూడ మండలాల్లో 12 గ్రామాల్లో వరి, మిర్చి, మొక్కజొన్న, పత్తి పంటలు పెద్ద మొత్తంలో నష్టపోయాయి.
హన్మకొండ జిల్లా నడికూడ మండలోనీ 12 గ్రామ  ఇలాకాలో చాలా వరకు నష్టం జరిగినప్పటికీ పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు చేస్తున్న జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నడికూడ మండల పరిధిలోని కౌకొండ గ్రామంలో 10 ఎకరాలు కవులు తీసుకొని సాగు చేసిన పత్తి మిర్చి మొక్కజొన్న పంటలు కాస్త నీటి పాలు కావడంతో రైతు పంటను చూసి రోదిస్తున్నారు.
ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులను పరామర్శించిన దాఖలాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్