Friday, December 13, 2024

తల్లిని చంపేసిన కూతురు…

- Advertisement -

గాంధీనగర్, సెప్టెంబర్ 1:  వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు బాగా పెరుగుతున్నాయి. కన్న పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు అని ఏ బంధాలు లేకుండా చంపడానికి కూడా వెనుకాడడం లేదు. వారి ఆనందం కోసం కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం ఏ మాత్రం ఉండడంలేదు. అలాంటి ఘటనే గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ 17 సంవ్సరాల యువతి ఏకంగా తల్లినే చంపేసింది. కచ్‌ సముద్ర తీరానికి సమీపంలో సగం పూడ్చిన స్థితిలో కుళ్లిపోయిన శవాన్ని పోలీసులు ఇటీవల గుర్తించారు. తొలుత శవాన్ని , మరణానికి గల కారణాన్ని కనిపెట్లలేకపోయారు. తర్వాత విచారణలో కూతురే హత్య చేసినట్లు గుర్తించారు.పోలీసుల విచారణ ప్రకారం.. యువతికి, తల్లి లక్ష్మి భట్‌కు ఒకే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తల్లికి, కూతురుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి తల్లిని చంపేయాలని కూతురు నిర్ణయించుకుంది. వీరితో సంబంధం పెట్టుకున్న వ్యక్తి యోగేష్‌ జోతియాన్‌(37), ఇతడి స్నేహితుడు నారన్‌ జోగి లతో కలిసి యువతి తన తల్లిని హత్య చేసింది. వీరంతా భుజ్‌ సమీపంలోని మాధాపర్‌ అనే గ్రామానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. వీరి గ్రామానికి 55 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఏ పోలీస్‌ స్టేషన్ లోనూ మిస్సింగ్‌ కంప్లెయింట్‌ ఇవ్వలేదని, ఇది హత్యేనని తాము గుర్తించినట్లు వెల్లడించారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.శవం దొరికిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు.

The daughter who killed her mother
The daughter who killed her mother

మహిళ ఫొటోతో పాంప్లైంట్స్‌ ప్రింట్‌ చేయించి సమీపంలోని అన్ని ప్రాంతాల్లో అంటించారు. మహిళ మృతదేహం దొరికిన ప్రాంతం కేవలం కొంత మంది చేపలు పట్టేవాళ్లకు మాత్రమే తెలుస్తుందని, కాబట్టి స్థానికులకు కచ్చితంగా ఏదో ఒక సమాచారం తెలుస్తుందని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు కొంతమంది ఇన్ఫార్మర్లను నియమించుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో గత నెల కొంతమంది బయటనుంచి హమీర్‌మోరాకు వచ్చిన వ్యక్తులు సముద్ర తీరానికి వెళ్లారని తెలిసింది. పోలీసులు ఫంక్షన్‌ డేట్‌ తెలుసుకుని యువతి లవర్‌ యోగేష్‌ ఫోన్‌ సిగ్నల్స్ ట్రాక్‌ చేయగా క్రైమ్‌ స్పాట్‌ సమీపంలో చూపించింది. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా పూర్తి వివరాలు వెల్లడించి హత్య చేసినట్లు అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. యువతి, ఆమె లవర్‌, అతడి స్నేహితుడు ముగ్గురు కలిసి లక్ష్మిని చంపడానికి నిర్ణయించుకుని జులై 13 న హమీర్‌మోరా అనే గ్రామానికి ఓ ఫంక్షన్‌కు తీసుకువెళ్లారు. తర్వాత సముద్ర తీరానికి వెళ్దామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి హత్య చేశారు. తర్వాత అక్కడే పూడ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. లక్ష్మికి ముందు జితేంద్ర భట్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 17ఏళ్ల కూతురు ఉంది. అయితే ఆరు నెలలుగా లక్ష్మి యోగేష్ అనే వ్యక్తితో వివాహతర సంబంధం పెట్టకుంది. కాగా మూడు నెలల నుంచి కూతురు, యోగేష్‌ చనువుగా ఉంటున్నారు. ఇది గమనించిన లక్ష్మి కూతురుతో గొడవ పడుతోంది. దీంతో  మైనర్‌ బాలిక తల్లి హత్యకు ప్లాన్‌ చేసిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్