పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్ పిన్నింటి రాజు మరణం బాధాకరం..

- Advertisement -

పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్ పిన్నింటి రాజు మరణం బాధాకరం..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్
బీజేపీ పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్ పిన్నింటి రాజు మరణం అత్యంత బాధాకరంమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.  పిన్నింటి రాజు ప్రజల మనిషి. కార్యకర్తలకు, సామాన్యులకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం క్రుషి చేసే పిన్నింటి రాజు ఇక లేరనే వార్త కలిచి వేస్తోందని అన్నారు.
బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన పిన్నింటి రాజు కుటుంబం పెద్దపల్లిలో స్థిరపడింది. బీజేపీలో సామాన్య కార్యకర్త గా మొదలై టౌన్ ప్రెసిడెంట్, జిల్లా కార్యదర్శిసహా అనేక పదవులు చేపట్టారు. రైతులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పని పడ్డా వారికి అండగా ఉంటూ తనవంతు సాయం అందించే వారు. అధికారులు, నాయకులకు సైతం తలలో నాలుకలా ఉండే పిన్నింటి రాజు మరణం పార్టీకి, పెద్దపల్లి నియోజకవర్గానికి తీరని లోటని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular