ఘనంగా సహస్ర ఫ్రెషర్స్ డే వేడుకలు ..విద్యార్థుల విజయమే మా ధ్యేయం: చైర్మన్ సందవేణి వెంకటేష్

- Advertisement -

ఘనంగా సహస్ర ఫ్రెషర్స్ డే వేడుకలు  

విద్యార్థుల్లో కొత్త ఆశయాలు.. క్యాంపస్‌లో ఉత్సాహం వెల్లివిరిసింది

విద్యార్థుల విజయమే మా ధ్యేయం: చైర్మన్ సందవేణి వెంకటేష్

క్రమశిక్షణ, నాణ్యమైన విద్య, పోటీ పరీక్షల శిక్షణతో ఉన్నత విజయాలు సాధ్యం

Sahasra Freshers’ Day celebrations held on a grand scale.

కరీంనగర్, ఆగస్టు 5 (వాయిస్ టుడే):

Sahasra Freshers' Day celebrations held on a grand scale.
Sahasra Freshers’ Day celebrations held on a grand scale.

విద్యార్థి జీవితంలో ఫ్రెషర్స్ డే కొత్త ఆశయాలకు నాంది పలికే వేడుక అని, కళాశాలలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని జూనియర్ కళాశాల ల, డిఫెన్సె అకాడమీ చైర్మన్ సందవేణి వెంకటేష్ అన్నారు.
జూనియర్ కళాశాల–డిఫెన్సె అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం నగరం లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో
నిర్వహించిన ఫ్రెషర్స్ డే పార్టీ కార్యక్రమాన్ని చైర్మన్ సందవేణి వెంకటేష్
, డైరెక్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను అందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా అధ్యాపకులను సంప్రదిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల అధ్యాపకులు విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి సన్మానించారు.

గౌరవ అతిథులు డైరెక్టర్లు ఎస్.రమేష్, బి. ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ వి. రామచంద్రారెడ్డి, ఎం .భాస్కర్
మాట్లాడుతూ…
ఫ్రెషర్స్ డే అనేది కేవలం స్వాగత కార్యక్రమం మాత్రమే కాదని, విద్యార్థుల జీవితంలో కొత్త ప్రయాణానికి శుభారంభమని ముఖ్య అతిథులు అన్నారు. కళాశాల దశలోనే లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని వాటి సాధన కోసం క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.
జూనియర్ కళాశాలలు,డిఫెన్సె అకాడమీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక శిక్షణను అందిస్తూ మంచి ఫలితాలు సాధిస్తోందని ప్రశంసించారు. విద్యార్థులు ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివితే తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకురాగలరని అన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి ఫ్రెషర్స్ డే, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కొత్తగా చేరిన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ వారి విద్యాభ్యాసం విజయవంతంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో సినీ నటులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, గెటప్‌లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు ఆ ఇద్దరు నటుల హావభావాలు, నడక, డైలాగ్ డెలివరీని అద్భుతంగా అనుకరిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరించారు. వారి అభినయం, వేదికపై ప్రదర్శించిన ఉత్సాహభరితమైన నృత్యాలు, నటనకు విద్యార్థులు, అధ్యాపకులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. ఈ ప్రదర్శనలు ఫ్రెషర్స్ డే వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డైరెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular