కార్యకర్తలను , ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడంవల్లనే *బిఆర్ఎస్ పార్టీ ఓటమి (జనవరి31-2024 వాయిస్ టుడే ప్రతినిధి మహబూబాబాద్). మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బుధవారం బి ఆర్ ఎస్ యువజన నాయకులు పుప్పాల మధు కుమార్ మాట్లాడుతూ..కష్టకాలంలో నిజమైన ఉద్యమకారులు పార్టీ కార్యకర్తలు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంతో త్యాగం చేసి జీవితాన్ని పార్టీకి అంకితం చేశారని జేబులో రూపాయి లేకున్నా జనం కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ కోసం నిరంతరం శ్రమించినారు..పార్టీ కోసం పనిచేసిన నాయకులను కార్యకర్తలను కాపాడుకోలేకపోవడంలో ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ విఫలమైందనీ వలసలతోనే ఓటమి చెందారని ..చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పలేకపోగా .కొన్ని పథకాల విషయాలలో అధిష్టానానికి తప్పుడు సంకేతాలు చెప్పి పార్టీని బ్రష్టు పట్టించారని అన్నారు..ఇప్పటికైనా పార్టీ కోసం కష్ట కాలంలో పనిచేసిన నాయకులను కార్యకర్తలను అధిష్టానం గుర్తించి కంటికి రెప్పల కాపాడుకునే బాధ్యత రాష్ట్ర నాయకత్వం తీసుకోవాలని, పుప్పాల మధుకుమార్ డిమాండ్ చేస్తున్నారు..