Sunday, September 8, 2024

మంత్రి హరీష్ రావు పర్యటనతో నెరవేరనున్న ఏండ్ల కల

- Advertisement -

మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న మంత్రి హరీష్ రావు

మంచిర్యాల, అక్టోబర్‌ 07 :  రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నేడు పర్యటించనున్నారు. మంచిర్యాల, చెన్నూర్‌ నియోజకవర్గాల్లో రూ.140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

హజీపూర్‌ మండలం పడ్తనపల్లిలో రూ.85 కోట్లతో నిర్మించే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో మండలంలోని 10 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. అనంతరం దొనబండ గ్రామంలో నిర్వహించే ప్రగతి నివేదన సభలో మంత్రి పాల్గొంటారు.

అక్కడి నుంచి చెన్నూర్‌కు చేరుకొని రూ.10 కోట్లతో నిర్మించిన 50 పడకల దవాఖానను మంత్రి ప్రారంభిస్తారు. మున్సిపల్‌ నిధులు, టీయూఎఫ్‌ఐడీసీ నిధులు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి ద్వారా మంజూరైన నిధులతో పలు అభివృద్ధి పనులను అంకురార్పన చేస్తారు.

చెన్నూర్‌ పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించే మోడ్రన్‌ ధోబీఘాట్‌ పనులు, టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.23 కోట్లతో చేపట్టే పనులకు భూమి పూజ చేస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.20 కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పూర్తి కావచ్చిన దృష్ట్యా, ఆ పనులకు కూడా మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేస్తారు. అనంతరం చెన్నూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌లో నిర్వహించే రోడ్‌షోలో మంత్రి పాల్గొననున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లాకేంద్రంతో పాటు దొనబండలో భారీ ఏర్పాట్లు చేశారు.

మంచిర్యాల, నస్పూర్‌ పట్టణాల నుంచి సభ నిర్వహించే దొనబండకు భారీ బైక్‌ ర్యాలీ తీయనున్నారు. బహిరంగ సభకు వేలాది మంది హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. చెన్నూర్‌ పట్టణంలో నిర్వహించే రోడ్‌షోకు యంత్రాంగం, అధికారులు పటిష్ట భద్రత ఉండేలా చూస్తున్నారు. చెన్నూర్‌ పట్టణం మొత్తం జెండాలు, భారీ కటౌట్‌లు ఏర్పాటు చేస్తున్నారు

నెరవేరనున్న ఏండ్ల కల

చెన్నూర్‌ రూరల్‌, అక్టోబర్‌ 6: ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ కృషితో ఏండ్ల కల నేరవేరింది. మండలంలోని సుద్దాల వాగుపై నిర్మించిన వంతెనను మంత్రి హరీశ్‌ రావు నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.

బాల్క సుమన్‌ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వంతెన నిర్మాణానికి నుంచి రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేయించారు. తర్వాత మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పనులు ప్రారంభించి త్వరగానే పూర్తి చేయించారు. నూతన బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సుద్దాల, కిష్టంపేట, కమ్మరిపల్లి, గంగారం, కాచన్‌పల్లి గ్రామస్తుల కష్టాలు తీరుతాయని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్