Sunday, March 23, 2025

ఉద్యోగుల ఎఫెక్ట్… ఎవరిపైనా

- Advertisement -

ఉద్యోగుల ఎఫెక్ట్… ఎవరిపైనా

విజయవాడ, మే 9

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల నాడి రాజకీయ పార్టీల కు అందడం లేదు. వేతన జీవులు, మధ్య తరగతి ఉద్యోగస్తుల అండదండలు ఏ పార్టీకి దక్కుతాయో తెలియని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు గణనీయంగా ఉంటారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీని మిడిల్ క్లాస్‌ ఓటర్లు, ఉద్యోగ వర్గాలు గెలిపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 14.76లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 4,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో లక్షా 28వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వంలో విలీనమైన ఏపీఎస్‌ ఆర్టీసీలో 53వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు అందుకున్న వారు దాదాపు ఆరులక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఏపీలో సర్వీస్ పెన్షనర్లు 3.58లక్షల మంది ఉన్నారు. సర్వీస్ పెన్షన్లపై ఆధారపడి ఫ్యామిలీ పెన్షన్ అందుకునే వారు మరో లక్ష మంది ఉన్నారు. ఇలా ప్రభుత్వ పెన్షనర్లు 4.58లక్షల మంది ఉన్నారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అన్ని శాఖల్లో, జిల్లాల్లో కలిపి లక్షా 20వేల మంది వరకు ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు 80వేల మంది, అంగన్‌ వాడీ వర్కర్లు, సహాయకులు మరో లక్షమంది ఉన్నారు. హోమ్‌ గార్డులు 15వేల మంది ఉన్నారు. మొత్తం అన్ని శాఖల్లో కలిపి 14,76వేల మంది ప్రభుత్వం నుంచి జీతాలు, పెన్షన్లు అందుకుంటున్నారుఏపీలో దాదాపు ఏడాది కాలంగా ఉద్యోగ సంఘాలన్నీ సైలెంట్ అయిపోయాయి. రోడ్ల మీదకు ఎక్కి పోరాటాలు చేయడం లేదు. సీపీఎస్‌ ధర్నాలు, పిఆర్సీ ఆందోళనలు చాలా నెలల క్రితమే ఆగిపోయాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చదనే క్లారిటీ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలన్నీ సైలెంట్ అయిపోయాయి. గత కొన్నేళ్లుగా ఉద్యోగుల పెన్షన్లు, జీతాలు ప్రతి నెల మొదటి వారం తర్వాతే జమ అవుతున్నాయి. ఈ పరిస్థితిపై ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి గూడు కట్టుకున్నా సంక్షేమ పథకాల అమలు, నగదు బదిలీకే ప్రాధాన్యం ఇచ్చారు. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో నవరత్నాల అమలు, నగదు బదిలీ పథకాలకే తొలిప్రాధాన్యం దక్కింది. దీంతో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపు, డిఏ బకాయిలు, సరెండర్ లీవులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి వాటికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించకలేక పదవీ విరమణ వయసును 62ఏళ్లకు పెంచారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా పదవీ విరమణ వయసు వచ్చిన తర్వాతే బెనిఫిట్స్‌ చెల్లిస్తామని మెలిక పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యం విషయంలో కూడా పలు సమస్యలు ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరో మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓటర్లుగా ఉన్నారు. బ్యాంకులు, రైల్వేలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పెట్రోలియం సంస్థలు, నేవీ, ఆర్మీ ఉద్యోగులు కూాడా గణనీయంగానే ఉన్నారు. సగటున ఒక్కో ఇంటికి నలుగురు ఓటర్లను లెక్కేసుకున్నా దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల్లో కనీసం 60-70లక్షల ఓట్లు ఉంటాయి.త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఓట్లన్ని ఎటువైపు మొగ్గు చూపిస్తాయనేది కీలకంగా మారింది. సంక్షేమ పథకాలు అందుకునే ఓటర్లపై వైసీపీ భారీ ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకునే వారికి నవరత్నాల్లో భాగంగా పెన్షన్లు, సంక్షేమ పథకాలను రద్దు చేశారు. 6 పాయింట్ల తనిఖీ పేరుతో లక్షల్లో లబ్దిదారులను తొలగించారు. అదే సమయంలో వారికి ఈహెచ్‌ఎస్‌ వంటి పథకాలను అమలు చేయడం లేదు.ఉద్యోగుల సమస్యలు, వేతనాల చెల్లింపుతో పాటు అరకొర జీతాలతో ఉద్యోగాలు చేేేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పథకాల వర్తింపు అంశం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. గత ఎన్నికల్లో గెలుపొటముల మధ్య రెండు ప్రధాన పార్టీలు రెండింటికి మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే ఉండటంతో ఈ సారి ఉద్యోగుల ప్రభావం భారీగా ఉంటుందని అంచనా ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్