- Advertisement -
ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. చావు ఫ్లెక్సీ పెట్టిన తండ్రి
TG: కూతురు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి ఆమె చావు ఫ్లెక్సీ ముద్రించాడు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది. చిలువేరి మురళీ కూతురు అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకుంది. అది నచ్చని తండ్రి ఆమె చనిపోయిందని ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. కొందరు వ్యక్తులు తన కూతురిని మోసంచేసి ట్రాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
- Advertisement -




