Thursday, April 24, 2025

 ఉత్కంఠను కలిగించే మర్డర్ మిస్టరీ ‘తత్వం’ ఫస్ట్‌లుక్‌ విడుదల

- Advertisement -

ఉత్కంఠను కలిగించే మర్డర్ మిస్టరీ ‘తత్వం’ ఫస్ట్‌లుక్‌ విడుదల

The first look of the suspenseful murder mystery 'Tatvam' is released

తత్వం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు మారుతి, కల్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌ కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఇదే కోవలో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం ‘తత్వం’. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి, కల్ట్‌ చిత్రాల నిర్మాత ఎస్‌కేఎన్‌ తమ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసి చిత్రబృందానికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ” మా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి, ఎస్‌కేఎన్‌లకు మా ధన్యవాదాలు. పెళ్లి చూపుల కోసమని ఓ గ్రామానికి వెళ్లిన హీరో, ఆ ఊరిలో జరిగిన హత్యల కేసులో ఎలా ఇరుక్కున్నాడు? ఆ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఈ పరిణామాల మధ్యలో అతను తెలుసుకున్న తత్వం ఏమిటి? అనేది ఈ చిత్ర కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తిగా ఉంటుంది’ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ” ఈతరం ప్రేక్షకులకు కావాలసిన అంశాలతో పాటు సినిమా చూసేటప్పుడు ఉండే ఉత్కంఠ ఈ చిత్రంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది. మా పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి, ఎస్‌కేఎన్‌లకు మా థ్యాంక్స్‌ చెబుతున్నాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: భరత్‌ రోంగలి, ఎడిటర్‌: విప్లవ్‌ నైషదం,కెమెరా: భరత్‌ పట్టి, డిఐ: భూషణ్‌, దర్శకుడు: అర్జున్‌ కోల, నిర్మాత: వంశీ సీమకుర్తి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్