మిఠాయిల పరిమళం – గాలిపటాల కళ… పరేడ్ గ్రౌండ్స్‌లో సాంస్కృతిక సంబరం

- Advertisement -

మిఠాయిల పరిమళం – గాలిపటాల కళ… పరేడ్ గ్రౌండ్స్‌లో సాంస్కృతిక సంబరం

* ఘనంగా ముగిసిన మూడు రోజుల అంతర్జాతీయ ఉత్సవం

The fragrance of sweets – the art of kites… a cultural celebration at the parade grounds
హైదరాబాద్: జనవరి 16;(వాయిస్ టూ డే)

నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో గత మూడు రోజులుగా నిర్వహించిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. సంక్రాతి సందర్బంగా గత మూడు రోజులుగా కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ (CLIC) ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ సహకారంతో గాలిపటాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కైట్ ఫెస్టివల్
లో ఏర్పాటు చేసిన ‘స్వీట్స్ పావిలియన్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన గృహిణులు తయారు చేసిన సంప్రదాయ మిఠాయిలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రాజస్థాన్ ఘేవర్ నుంచి కేరళ పాయసం వరకు వివిధ ప్రాంతాల వంటకాలు ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చాయి.
అలాగే గాలిపటాల ఉత్సవం ఆకాశాన్ని రంగులతో నింపింది. పలు దేశాల నుంచి వచ్చిన నిపుణ గాలిపటాల కళాకారులు ఫ్యాన్సీ గాలిపటాలతో విన్యాసాలు ప్రదర్శించారు. స్థానిక గాలిపటాల ప్రేమికులు కూడా పోటీపడి సంక్రాంతి సంప్రదాయాన్ని కొనసాగించారు.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఇలాంటి ఉత్సవాలు కీలకమని ఆయన అన్నారు. ఉత్సవ కన్వీనర్ లిబీ బెంజమిన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆహారం, క్రీడల ద్వారా భారతదేశం–ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తోందని తెలిపారు.భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో పరేడ్ గ్రౌండ్స్ మూడు రోజుల పాటు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular