- Advertisement -
ఉచిత ఇసుక పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు
The free sands are trespassers
నిజమైన లబ్దిదారులకు ఉచిత ఇసుక అందే వరకు పోరాటం చేస్తాం
మన సంపద సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలి పోకూడదన్నదే ప్రధాన ఉద్దేశ్యం
చెక్ పోస్టులు, ఇసుక రీచ్ ల పరిశీలనలో – సిపిఐ
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో పలు ఇసుక రీచ్ లు మరియు సరిహద్దు చెక్ పోస్ట్ లను యన్.టి.ఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ నాయకత్వాన సిపిఐ బృందం పరిశీలించింది.ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో గల ప్రభుత్వ అనుమతులు లేని ఇసుక రీచ్ లను పరిశీలించడం జరిగింది.ఈ పర్యటనలో భాగంగా లింగాల,కన్నెవీడు,ఇందుగపల్లి,మల్కాపురం,గండ్రాయి గ్రామాల మీదుగా ఇందుగపల్లి ఇసుక రీచ్ ని వారు మరియు గండ్రాయి,నేషనల్ హైవే 65 పై వద్ద గల సరిహద్దు చెక్ పోస్ట్ లను పరిశీలించడం జరిగింది.జగ్గయ్యపేట పట్టణంలో గల సిపిఐ పార్టీ పిల్లలమర్రి భవన్ లో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పథకాని ప్రవేశ పెట్టారు.దీనిలో యన్.టి.ఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేని ఇసుక రీచ్ ల నుండి ఉచిత ఇసుకను కొందరు నాయకులు వారి అనుచరులు కలిసి సరిహద్దు రాష్ట్రానికి అక్రమంగా ఉచిత ఇసుకను తరలిస్తున్నారని, జగ్గయ్యపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే 55 కేసులు నమోదు చేయడం జరిగిందని పోలీసు వారు పెరుకొనటమే మా పోరాటానికి నిదర్శనం అని అన్నారు.ఆ సందర్భంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్న గండ్రాయి చెక్ పోస్ట్ ల వద్ద భూభారి గేట్లు నిరుపయోగంగా ఉన్నాయని, ఉన్న ఒక్క సిసి కెమెరా పనిచేయకపోతే అక్రమ రవాణా సుసాధ్యం అవుతుందని, దీని పైన పోలీసు శాఖ దృష్టి పెట్టాలని అన్నారు.నేషనల్ హైవే 65 పై చెక్ పోస్ట్ వద్ద గల నిఘా నేత్రలు వాహనాలను చూడాలే తప్ప,భూమి వైపు చూడటం సరికాదన్ని ,మరింతగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.ఉచిత అక్రమ రవాణా నివారించడానికి అవసరమైతే అఖిల పక్షం ఏర్పాటు చేసి, అక్రమార్కుల భరతం పట్టాలని అన్నారు.కమ్యూనిస్టులు ప్రజల కోసం పనిచేసే వారేని,ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమాలు చేపడుతామని అన్నారు.జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలలో సహజ వనరులను ఎవ్వరు దోపిడి చేసిన సిపిఐ సహించదని, ప్రస్తుతం సిపిఐ పోరాటం వల్ల అక్రమ రవాణా ఆగిందని,భవిష్యత్తు లో ఇసుక అక్రమ రవాణాని ఎవ్వరు చేస్తున్న సిపిఐ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లు ఇసుక అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ, పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మరియు జిల్లా సిపిఐ నాయకులు బుట్టి రాయప్ప, జిల్లా భవన నిర్మాణ కార్యదర్శి సోనా రాజు, జిల్లా ఏవైయఫ్ అధ్యక్ష, కార్యదర్శి కరిసే మధు,లంకా గోవింద రాజులు,సామాజిక కార్యకర్త పల్లేటి కౌమిది,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు గోడెల జనార్థన్,జగ్గయ్యపేట నియోజకవర్గ,పట్టణ సిపిఐ నాయకులు షేక్ అసదుల్లా,బోగ్యం నాగులు,మెటికల శ్రీనివాసరావు,వై భాను, వత్సవాయి మండలం కార్యదర్శి షేక్ జాని తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -