‘#సింగిల్’ నుంచి ది ఫ్రస్ట్రేషన్ యాంథమ్- సిర్రాకైంది సింగిల్ బతుకు సాంగ్ రిలీజ్

- Advertisement -

అల్లు అరవింద్ ప్రజెంట్స్, శ్రీ విష్ణు, కార్తీక్ రాజు, గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ ‘#సింగిల్’ నుంచి ది ఫ్రస్ట్రేషన్ యాంథమ్- సిర్రాకైంది సింగిల్ బతుకు సాంగ్ రిలీజ్

The Frustration Anthem from '#Single' - Sirrakaidhi Single Batuku Song Release

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి  విశాల్ చంద్ర శేఖర్ సంగీత దర్శకుడు. ఫస్ట్ సింగిల్ ఒక సోల్ ఫుల్ రొమాంటిక్ మెలోడీ. సెకండ్ సింగిల్ గ్రూవ్ టు ది ఫ్రస్ట్రేషన్ యాంథమ్ సిర్రకైంది  సింగిల్ బతుకు కొద్దిసేపటి క్రితం విడుదలైంది.  “ఫ్రస్ట్రేషన్ యాంథెమ్”గా  ఈ పాట, ఒంటరి జీవితాన్ని ఒక వేడుకలా చూపిస్తుంది.పాటలో సరదా సాహిత్యం, ఆకట్టుకునే మాస్ అప్పీల్ ఉన్నాయి. రాహుల్ సిప్లిగంజ్ వోకల్స్, రామజోగయ్య శాస్త్రి చమత్కారమైన సాహిత్యంతో ఈ సాంగ్ అలరిస్తోంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్‌తో కలిసి ఒంటరితనం ని హ్యుమర్ తో జోడిస్తూ చెప్పడం హిలేరియస్ గా వుంది.  కేతికా శర్మ,  ఇవానా ఈ చిత్రంలో హీరోయిన్స్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్ వేల్ రాజ్, ఎడిటింగ్ ప్రవీణ్ కెఎల్. ఆర్ట్ డైరెక్టర్ చంద్రిక గొర్రెపాటి.#సింగిల్ మూవీ మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
నటీనటులు: శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular