రాజ్యాధికారమే లక్ష్యంగా మున్నూరు కాపు మహిళలు నడుం బిగించాలి* *బండి పద్మ*
The goal of state power is to strengthen the women of Munnur Kapu* *Bandi Padma*![]()
*ఈనెల 13న జలవిహార్ లో మున్నూరు కాపు సమావేశానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు* *మున్నూరు కాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి పద్మ* కంటోన్మెంట్, ఏప్రిల్ 10 (వాయిస్ టుడే ప్రతినిధి) రాజ్యాధికారమే లక్ష్యంగా మున్నూరు కాపు మహిళలు నడుం బిగించినట్లు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలు బండి పద్మ స్పష్టం చేశారు.సికింద్రాబాద్ బోయిన్పల్లి లోని రాజరాజేశ్వరి గార్డెన్ లో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.ఈనెల 13న జలవిహార్ లో రాష్ట్రస్థాయి మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు, ప్రతి నిధుల సమావేశాన్ని మున్నూరు కాపు గర్జన కార్యాచరణ కమిటీ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి మున్నూరు కాపు మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సింహగర్జన పేరుతో మే లో పరేడ్ మైదానంలో 10 లక్షల మందితో సభను పెద్దలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు, మున్నూరు కాపు మహిళలకు అన్ని పార్టీల వాళ్ళు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీ నాయకుడు ముఖ్యమంత్రిగా చేయడంలో మున్నూరు కాపు పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన విషయంలో మున్నూరు కాపులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. బీసీలు ఇప్పటికైనా వెనుకబాటుతనాన్ని వీడి రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ రాజ్యాధికారం చేపట్టే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, సెక్రటరీ పోకల నిర్మల, ఉపాధ్యక్షురాలు అరుణ, గీత, సెక్రటరీ సునీత, శేర్లింగంపల్లి ఇన్చార్జి శ్రీలత, సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జ్ సంధ్యారాణి, బాల్నగర్ ఇన్చార్జి శివరంజని, జూబ్లీహిల్స్ ఇన్చార్జ్ కవిత తదితరులు పాల్గొన్నారు.