Friday, February 7, 2025

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

The government is committed to the welfare of fishermen

—రాష్ట్ర రవాణాశాఖ మంత్రి  రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి, జనవరి 28

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో గాలివీడు మండలంలోని  వెలుగల్లు ప్రాజెక్టులో 4.80 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం వారికి సబ్సిడీపై వలలు, బోట్లు, ఐస్ బాక్సులు మోటార్ సైకిల్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలన్నారు. గాలివీడు మండలంలో దాదాపు 300 కుటుంబాలు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని వారందరికీ తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
రాయచోటి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రాబోయే మూడు సంవత్సరాలలో వెలుగల్లు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసి శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 300 బోర్లు, మరియు మోటార్లు బిగించి గ్రామాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు భూ అక్రమాలు అనేకం జరిగాయని ఈ ప్రభుత్వంలో అలాంటి వేమీ జరగవున్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం మంజూరు చేయించి ఇల్లు నిర్మించడం జరుగుతుందన్నారు. గృహ నిర్మాణ శాఖ నూతన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండే వారికి 3 సెంట్లు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవారికి రెండు సెంట్లు చొప్పున ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కల్లులాంటివని రాబోయే రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడురాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించి ప్రతి ఒక్కరి సంక్షేమానికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. హంద్రీనీవా కాలువలు అభివృద్ధి చేసి 22 వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు.
గాలివీడు మండలంలో పనిచేసే రెవెన్యూ అధికారులందరూ రైతులకు అందుబాటులో ఉండి శాశ్విత భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతుందని ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రజలు ఎటువంటి సమస్యలకు గురికాకుండా  సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. ఇలాంటి మంచి ప్రభుత్వానికి రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ డిడి సుస్మిత, తాసిల్దార్, ఎంపీడీవో, నీటిపారుదల శాఖ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం గాలివీడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండిపల్లి నాగిరెడ్డి జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన మెగా టాలెంట్ టెస్ట్ విజేతలకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూవిద్యార్థులు చిన్నతనం నుంచే మంచి క్రమశిక్షణతో బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలన్నారు. మన ప్రాంతం విద్యార్థులు బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు సాఫ్ట్వేర్ రంగాలలో స్థిరపడ్డారని మీరు కూడా బాగా చదివి మంచి ఉద్యోగాలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష సాధన దిశగా ముందుకు వెళ్లినట్లయితే అనుకున్నది సాధించవచ్చునున్నారు.విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలలో కూడా రానించి శరీర దారుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు విద్య ఉద్యోగాలలో 3 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఉపాధ్యాయులు విద్యార్థుల కోరిక మేరకు త్వరలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతుందన్నారు.
క్రీడాకారులకు క్రీడా ప్రాంగణానికి, టెన్నిస్ కోర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.అధికారులు ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నమండెం మండలం, బోరెడ్డిగారి పల్లెలోని తమ నివాసం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్నమయ్య జిల్లాలో సమస్యలు అధికంగా ఉన్నాయని అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం చిన్నమండెం మండలం, బోరెడ్డిగారి పల్లెలోని తమ నివాసం నందు ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్  యూనియన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం లోని కార్పెంటర్ యూనియన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.చిన్నమండెం మండలం, నాగిరెడ్డికాలనీ లో 32 లక్షలతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, మరియు నూతన బోరు ను మంగళవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూరాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు చేయడం జరుగుతుందన్నారు. దీంతో నేడు నాగిరెడ్డికాలనీ లో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్లు సిమెంటు రోడ్ల నిర్మాణాలను నాణ్యతతో నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని వారికి సూచించారు. అనంతరం మంత్రివర్యులు నాగిరెడ్డికాలనీలో నీటి సమస్య పరిష్కారానికి నూతన బోరును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్