Sunday, September 8, 2024

ఆ సర్క్యులర్ పై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

- Advertisement -

ఆ సర్క్యులర్ పై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
కొందరికి శాపంగా మారిన సర్కులర్
సర్కులర్ తో ధికారులకు కాసుల పంట
వరంగల్

The government should reconsider that circular.

గత ప్రభుత్వం ఇచ్చిన 257 సర్కులర్ పై ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో వచ్చిన ఆ సర్కులర్తో ప్రజలు ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దాని మూలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూములుకొన్నా పేద మధ్యతరగతి ప్రజలు కోలుకోలేకుండా పోతున్నారని, వారి ఆశలను సమాడిచేసి ఆర్థిక భారాన్ని మిగిల్చి  అయోమయానికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.2019 సంవత్సరంలో జి2. 257 సర్కులర్ను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ విడుదల చేసింది.మరో ఏడాది అనంతరం 29. 12 . 2020 ఆ సర్కులర్లో కొన్ని మార్పులు చేస్తూ కొత్త సర్కులర్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో తెలంగాణలోని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు  కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టిందని సంబంధిత శాఖలో పనిచేస్తున్న అధికారులు వాపోతున్నారు. ఆ సర్కులర్ లో పేర్కొన్న విధంగా క్షేత్రస్థాయిలో పనులు జరగకపోవడం వల్ల అధికారులు, ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ సర్కులర్ లో పేర్కొన్న విధంగా ఆయా సబ్ రిజిస్ట్రేషన్ల పరిధిలో ఏర్పాటు చేయబడుతున్న కొత్త వెంచర్ల లోని ప్లాట్లు మినహా మిగతా అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేయవచ్చునని పేర్కొన్నారు.ఐతే గతంలో సబ్ రిజిస్ట్రేషన్ల పరిధిలో క్రయవిక్రయాలు జరిగి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిలో అమ్మకాలు కొనుగోలు జరగకుండా ఉన్న నిబంధన ఏదీ లేదని  ఆ సర్కులర్లో లేదని సంబంధిత అధికారులు అంటున్నారు.ఈ క్రమంలో  రియల్ ఎస్టేట్ వ్యాపారులు,మధ్య తరగతి ప్రజలు తమకు చెందిన భూముల్లో కొంత భాగాన్ని అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఆ సర్కులర్ తమ పాలిట కుదిబండగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆ సర్కులర్ పై ఇప్పటి ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రజలకు మేలైన విధంగా కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వం అర్థంపర్థం లేకుండా తెచ్చిన సర్కులర్ జి 2 ,257 ను రద్దుచేసి పేద మధ్య తరగతి ప్రజలతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి దోహదపడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
శాపంగా మారిన సర్కులర్ ను రద్దు చేయాలి.

The government should reconsider that circular.

గత తెలంగాణ ప్రభుత్వం అర్థంపర్థం లేకుండా తీసుకువచ్చిన g2, 257 సర్కులర్ రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.కొందరి పాలిట శాపంగా మారిన దాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. వరంగల్ జిల్లాలోని వివిధ సబ్ రిజిస్ట్రేషన్ల పరిధిలో భూములను కొనుగోలు రిజిస్ట్రేషన్ చేసుకొన్నావారు ప్లాట్లుగా మార్చి అమ్ముకోవాలనుకుంటున్న వారికి ఆ సర్కులర్ ప్రమాదకరంగా మారి ఆర్థికంగా తీవ్రమైన నష్టాలు మిగిలిస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఆ సర్కులర్ మూలంగా భూములు అమ్ముకోలేకపోతున్నామని దాంతో తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆ సర్కులర్లో ఎక్కడ గతంలో క్రయవిక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటిలో కొంత భాగాన్ని అమ్ముకోవద్దన్న నిబంధన ఏది లేదని ప్రజలు అంటున్నారు. అయినప్పటికీ ఆయా సబ్ రిజిస్టర్లు ఆ సర్కులర్ ను అడ్డం పెట్టుకొని తమ భూములను అమ్మకాలు చేపట్టకుండా అడ్డుపడుతూ కాసులు దండుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణలోని కొత్త ప్రభుత్వం జి 2. 257 మార్చి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిబంధనలు మార్చాలని ప్రజలు కోరుతున్నారు. దీన్ని సాకుగా తీసుకున్న జిల్లాలోని సబ్ రిజిస్టార్లు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ కాసులకు కక్కుర్తి పడుతున్నారని విమర్శలు నెలకొన్నాయి. కొత్త వెంచర్లలో కూడా రిజిస్ట్రేషన్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరికి కాసుల పంట పండిస్తుండగా పేద మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారిన ఆ నిబంధనను మార్చి వేయాలని ప్రజలు తెలంగాణ డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్