దేశానికే తలమానికం… చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం మాజీమంత్రి
The head of the country... Construction of Chilakaluripet bypass ex-minister
– గత ప్రభుత్వ దురాలోచనతో నిలిచిపోయిన బైపాస్ విస్తరణ పనులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయి
– ప్రత్తిపాటి
– రూ.907కోట్లతో 16 కిలోమీటర్ల మేర నిర్మించిన నూతన బైపాస్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడం రాష్ట్రప్రగతిలో కీలకఘట్టంగా నిలిచింది :
పుల్లారావు.
దేశంలో ఎక్కడాలేని విధంగా చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం జరిగిందని, కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వ సహాయసహాకారాలతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన మొట్టమొదటి జాతీయ రహదారిగా నిలిచిందని,
నియోజకవర్గానికే మణిహారంగా నిలిచిన బైపాస్ ను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయడం రాష్ట్రప్రజలకే గర్వకారణమని మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు
గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ ట్రాఫిక్ సమస్యతో పాటు, చెన్నై – కోల్ కతా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల కష్టాల పరిష్కారం కోసం 2014 లోనే టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నో ఏళ్లుగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలతో పాటు, చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారుల కష్టాలకు చెక్ పెట్టాలని, విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ సమస్యను
సరిదిద్దాలన్న సదుద్దేశంలో భాగంగా 2014లో నాటి టీడీపీ ప్రభుత్వం బైపాస్ విస్తీర్ణానికి నడుం బిగించింది. అప్పటికే 4 వరసలుగా ఉన్న జాతీయ రహదారిని 6 వరసలకు పెంచాలన్న ప్రతిపాదనను నాటి కేంద్రప్రభుత్వం
ముందు ఉంచింది. రహదారి వెడల్పుతో ఒనగూరే ప్రయోజనాలను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖకు, జాతీయ రహదారుల విభాగానికి అర్థమయ్యేలా తెలియచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ వివరణపై స్పందించిన కేంద్రం,
జాతీయరహదారికి అనుబంధంగా ఒకసారి బైపాస్ నిర్మాణం చేపట్టాక దేశంలో ఇంతవరకు ఎక్కడా తమ సొంత నిధులతో భూసేకరణ జరిపి, మరలా దాన్ని విస్తరించిన దాఖలాలు లేవని, అలా చేయాలంటే జాతీయ
రహదారుల చట్టాన్ని సవరించాలని స్పష్టం చేసింది. కేంద్రం వివరణపై స్పందించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రహదారి విస్తరణ అవసరాన్ని, ఆవశ్యకతను తెలియచేస్తూ పూర్తిస్థాయి సమాచారం అందించి, కేంద్ర
కేబినెట్ లో చట్టసవరణ బిల్లు పెట్టించి, చిలకలూరిపేట బై పాస్ రహదారి నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయేలా చేశారు.