- Advertisement -
పేర్ని జయసుధ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
The hearing of Perni Jayasudha's bail petition was adjourned
మచిలీపట్నం
పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్ ఈ నెల 19కి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారని పేర్ని నాని సతీమణి జయసుధపై బందరు తాలుకా పీఎస్ కేసు నమోదు నమోదయింది. ఈ కేసులో గత శుక్రవారం జిల్లా కోర్టులో పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. బెయిల్ పిటీషన్ ను తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుకు జిల్లా జడ్జి బదిలి చేసారు. తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చింది. పోలీసుల నుండి సీడీ ఫైల్ రాకపోవటంతో విచారణను 19కి న్యాయమూర్తి వాయిదా వేసారు. గత వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. పోలీసులు పేర్ని నాని కుటుంబ సభ్యుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. పేర్ని నాని సన్నిహితుల కాల్ డేటాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం..
- Advertisement -