సైనిక కార్పొరేషన్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా
-రిజర్వేషన్ల అంశాన్ని క్యాబినెట్ లో పెడతాం
– అల్లంపురం టి.బి.ఆర్ సైనిక స్కూల్ ద్వారా బావి భారత పౌరులను తీర్చి దిద్దుతున్న టి.బి.ఆర్ స్కూల్ అధినేత తనబుద్ధి భోగేశ్వరాను అభినందించారు
– తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం గ్రామానికి వస్తా సైనిక కుటుంబాలను కలుస్తా
హోం మంత్రి వంగలపూడి అనిత
The issue of military corporation will be brought to the attention of the CM
తాడేపల్లిగూడెం,
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సైనికులు సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ఆవరణలో కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవ వేడుక ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు టీబీఆర్ విద్యాసంస్థల అధినేత తన బుద్ధి భోగేశ్వర రావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అనిత మాట్లాడుతూ సైనికులు 30 నుంచి 35 ఏళ్ల మధ్య రిటైర్ అవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రస్తుతం ఉన్న రెండు శాతం రిజర్వేషన్లను పెంచడానికి క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సైనికులకు మంచి జరిగేలా చూస్తామన్నారు. జిల్లాలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. ఏటా మనకు గుర్తుండిపోయే రోజులు జనవరి 26, ఆగస్టు 15 అని తెలిపారు. పివిఆర్ విద్యా సంస్థను చూసిన తర్వాత, అక్కడి విద్యార్థుల క్రమశిక్షణ చూస్తే గర్వంగా ఉందన్నారు. సైనిక్ స్కూల్ ద్వారా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశానికి సైనికులు అంటే ఒక గౌరవమని భారతీయులంతా ప్రశాంతంగా నిద్రపోవడానికి సైనికులే కారణమని పేర్కొన్నారు. జవాన్లకు సెల్యూట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీసులైనా, సైనికులైనా వారు చేసే సేవలు, త్యాగం మనకు అర్థం కాదన్నారు. దేశం కోసం ప్రాణాలను పెంచినవారు సైనికులని కొనియాడారు. తాడేపల్లిగూడెం మండలం మిలటరీ మాధవరం గ్రామానికి తాను ఒకసారి వస్తానన్నారు. సైనికుల తల్లిదండ్రులు, భార్యలను గౌరవించుకోవాలన్నారు. బిడ్డల్ని యుద్ధానికి పంపించే క్రమంలో సైనికులు గా తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులకు ఎంత ధైర్యం, దేశభక్తి ఉండాలో ఆలోచన చేయాలన్నారు. పోలీసులను, జవాన్లను గౌరవించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు సైతం ఈ విషయం తమ బిడ్డలకు తెలియజెప్పే పరిస్థితి రావాలన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖంగా ఉండమంటే దానికి కారణం సైన్యం అని కొనియాడారు. సైనిక స్కూల్ ద్వారా రాష్ట్రంలో ఒక వినూత్న ప్రయోగం చేసిన టీబీఆర్ విద్యా సంస్థల అధినేత భోగేశ్వరరావుని అభినందించారు. కార్గిల్ యుద్ధంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి శిరసు ఉంచి నమస్కరిస్తున్నానన్నారు. మైనస్ 11 డిగ్రీల మధ్య సైనికులు పనిచేయడం ఆసమాసి విషయం కాదన్నారు. మిలటరీ మాధవరం గ్రామం తన నియోజకవర్గంలో ఉండడం గర్వంగా భావిస్తున్నాను అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టాల్స్ క్యాంటీన్ పెట్టాలని మాజీ సైనికులు కోరుతున్నారని ఈ విషయాన్ని సీఎం దృష్టిలో పెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో మంత్రి అనిత చొరవ తీసుకోవాలని కోరారు. మిలిటరీలో మృతి చెందిన వారి కుటుంబాల సంక్షేమం కోసం మూడు కోట్ల రూపాయలను పవన్ కళ్యాణ్ విరాళం అందజేశారన్నారు. మంత్రి అనిత సైతం రాజకీయంగా ఎన్నో పోరాటాలు చేశారన్నారు. రాజకీయాల్లో తిమింగనాలతో పోరాటం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ వంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భోగేశ్వరరావును అభినందించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ దేశంలో మనకు స్వేచ్ఛగా ఉన్నామంటే అది సైనికుల త్యాగ ఫలితమేనని పేర్కొన్నారు. సైనికులు దేశ సరిహద్దుల్లో ఏ విధంగా పోరాటం చేస్తున్నారో అదే విధంగా గత ప్రభుత్వంలో పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ వంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.