Sunday, September 8, 2024

పింఛన్ 3000 పెంచడంతో అవ్వాతాతల కళ్లల్లో వెల్లివిరిసిన ఆనందం…

- Advertisement -

పింఛన్ 3000 పెంచడంతో అవ్వాతాతల కళ్లల్లో వెల్లివిరిసిన ఆనందం…

ఈ నెలలో కొత్తగా మంజూరైన లబ్దిదారులకు పెన్షన్‌ పత్రాల అందజేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి…

నంద్యాల

కొత్త సంవత్సరం నంద్యాల నియోజకవర్గం లో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి రూ.మూడు వేల చొప్పున ఈనెల పింఛను డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ ప్రతినెలా ఇచ్చే రూ.2,750 పెన్షన్‌ మొత్తాన్ని ఈ జనవరి ఒకటి నుంచి రూ.మూడు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఎంపీడీవో కార్యాలయం నందు నంద్యాల మండలం లోవున్న లబ్ధిదారులకు పింఛన్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది  అందులో భాగంగా 7118 మంది లబ్ధిదారులకు నేడు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ,   కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. వలంటీర్లు కూడా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు అందజేయాలని కోరారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు.. నిజానికి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్‌ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ఈ జనవరి నుంచి రూ.మూడువేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. అలాగే తెలుగుదేశం నాయకులు అభివృద్ధి జరగలేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడం తగదని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు  సిసి రోడ్లు డ్రైన్స్ నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా రూపొందించామని తెలుగుదేశం నాయకుల వలె జన్మభూమి కమిటీల ద్వారా వారి కార్యకర్తలకు మాత్రమే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేశారని మన ప్రభుత్వంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తున్నామన్నారు కరోనా సమయంలో ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కూడా రాలేదని ఇప్పుడు మాత్రం ఎలక్షన్ రావడంతో ఓట్ల కోసం తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారిని నమ్మాల్సిన అవసరం లేదన్నారు.సీఎం జగనన్న తానిచ్చిన మాటను అమలుచేసి చూపించడంతో  నేడు నంద్యాల మండలం లో కొత్తగా 173 పింఛన్లు మొత్తం 7118 మందికి  పింఛన్ పత్రలను అందజేయడం జరిగిందన్నారు …

ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వరరెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్, ఎంపీడీవో సుగుణశ్రీ,మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి,మరియు గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీ లు గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్