పార్లమెంట్లో ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లుల ను తక్షణమే రద్దు చేయాలి
The labor codes introduced in the Parliament should be repealed immediately
కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసిన వామపక్ష కార్మిక సంఘాల నేతలు
దేవనకొండ ఫిబ్రవరి 5
కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఏఐటీయూసీ, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలియజేసి కేంద్ర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి. వీరశేఖర్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఏం. నరసరావు లు మాట్లాడుతూ… లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. స్వాతంత్రం ముందు నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినదని కోవిడ్ కాలంలో దుర్మార్గంగా పార్లమెంట్లోనూ బయట ఎటువంటి చర్చ జరగకుండా 2019 వేతనాలు కోడును 2020లో పారిశ్రామిక సంబంధాల కోడ్ ను సామాజిక భద్రత, వృత్తి భద్రత ఆహారం మరియు పని పరిస్థితుల కోడు ల ను ఆమోదించింది. రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదముద్ర పొందింది, రూల్స్ ఆమోదించి మోదీ ప్రభుత్వం ఎప్పుడైనా అమలు చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. కార్మిక వర్గానికి ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి హక్కులను కుదించడమే లేబర్ కోడ్ ల ముఖ్య ఉద్దేశం అని కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు అమలు జరిపితే తిరుగుబాట్లు అని వార్యం అన్నారు. సమ్మెలు చేయకుండా నిబంధనలు లేబర్ కోడులో తీవ్రతరం చేశారని ఆరోపించారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ బోనస్ కనీస వేతనాలు లాంటి ప్రాథమిక చట్టాలు అమలు అధోగతి పట్టిందన్నారు.కావున తక్షణమే4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ భాష, ఏఐటియుసి, సిఐటియు కార్మిక సంఘాల నేతలు బడే సాహెబ్ రాఘవేంద్ర లక్ష్మణస్వామి మా భాష కృష్ణ రామాంజి తదితరులు పాల్గొన్నారు