మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యం
గంజాయి,డ్రగ్స్ నిర్మూలన మన అందరి బాద్యత,
డ్రగ్స్‌ని తరిమికొట్టేందుకు అందరం చేతులు కలుపుదాం
పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్
గోదావరిఖని ప్రతినిధి
మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని రామగుండము పోలీస్ కమీషనర్.ఎం.శ్రీనివాస్. అన్నారు.యువత,విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా అవగాహన పెంపొందించే దిశగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా బుధవారం మున్సిపల్ జంక్షన్ నుండి గాంధి చౌరస్తా వరకు* గోదావరిఖని వన్ టౌన్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.అట్టి ర్యాలీకి రామగుండము పోలీస్ కమీషనర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలి ప్రారంబించి ప్రజలు ,విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణ ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈసందర్బంగాసిపిఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ ..యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడివృథా.చేసుకోకూడదని
ఒక్కసారి డ్రగ్స్ వాడినా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు. సినిమాల్లో మాదకద్రవ్యాల వినియోగం అనేది యువత మనస్సులపై ప్రభావం చూపుతుంది. గంజాయి, డ్రగ్స్ వినియోగం ఒక సోషల్ స్టేటస్, ఫ్యాషన్ గా బావిస్తున్నారు ప్రస్తుతం యువత.విద్యార్థులు,యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అందమైన జీవితాన్ని గడపాలని అన్నారు.
యువత, విద్యార్థులు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకుఅలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.స్నేహితులు, దగ్గరివారుఎవరైనామత్తు
పదార్ధాలకు అలవాటు పడితె వెంటనే దూరంగా ఉండేలా కృషి చేయడం మన బాధ్యత అన్నారు.గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. ఆత్మహత్య ఆలోచనలు సైతం కలగడం, వ్యక్తులు తమను తాము గాయపరచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు వింటూ ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు. స్కూల్స్, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి అక్రమ రవాణా సరఫరా ,విక్రియంచే వారిపై కేసులు నమోదు చేసి జైలు కు పంపడం జరుగుతుందని ఒక్కసారి కేసు నమోదు ఐనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక భవిష్యత్తు నాశనం అయి ఇబ్బంది పడవలసి వస్తుంది అనిసూచించారు.
మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సిపి విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేశారు*.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్,స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, రామగుండం ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి,రామగుండం సీఐ అజయ్ బాబు,గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్,గోదావరిఖని వన్ టౌన్ ఎస్సైలు శ్రీనివాస్, వెంకటేష్,సుగుణాకర్, రామగుండం ఎస్ఐ సతీష్, అంతర్గం ఎస్ఐ వెంకట్ లు, డాక్టర్ లక్ష్మి వాణి, ప్రజా ప్రతినిధులు,లైన్స్ క్లబ్ సభ్యులు,విద్యార్థిని విద్యార్థులు,ఎన్ సి సి. క్యాడేట్స్, యువత,స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.