మధ్యాహ్న భోజన పథకాన్ని  పునః  ప్రారంభించాలి……

- Advertisement -

మధ్యాహ్న భోజన పథకాన్ని  పునః  ప్రారంభించాలి……

The mid-day meal scheme should be re-introduced.

ఎస్ఎఫ్ఐ

ఎమ్మిగనూరు అక్టోబర్ 28
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని  పునః  ప్రారంభించాలి. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని  ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సోమప్ప సర్కిల్లో ధర్నా చేసి తర్వాత తాసిల్దార్ శేష షాణి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం విద్యావిధానంలో 100 రోజులలోనే  సమూలమైన మార్పులు తీసుకొస్తమంటూ యువగళం పాదయాత్రలో చెప్పి ఇప్పుడు కాలయాపన చేయటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న రూ.3,480 కోట్ల విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలి,డిగ్రీలో మేజర్, మైనర్ విధానాన్ని రద్దు చేయాలి,
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి తల్లికి వందనం డబ్బులను వెంటనే జమ చేయాలని,సంక్షేమ హాస్టల్స్ కి సొంత భవనాలు కేటాయించి, మెస్ ఛార్జీలు నేలను రూ.3000లకు పెంచి మౌలిక వసతులు కల్పించాలని,యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసి ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెం.77 రద్దు చేయాలని,ప్రభుత్వ ఐటిఐ పాలిటెక్నిక్, ఉర్దూ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు
లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, వినోద్, ప్రవీణ్, కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular