- Advertisement -
పట్టణంలోని అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
The MLA inspected the development works in the townపెద్దపల్లి
పట్టణంలోని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చింత కుంట విజయ రమణ రావు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే టీఎఫ్ ఐడీసి నిదుల ద్వారా ప్రారంభం కానున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తో కలిసి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ అభివృద్ధి కొరకు నెల రోజుల క్రితం 30 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేసుకుని పనులు మొదలు పెట్టడం జరిగిందని 9 ప్యాకేజీలకు గాను 7 ప్యాకేజీల పనులు మొదలు పెట్టడం జరిగిందని ఈనెల 4వ తేదీన పెద్దపల్లి పట్టణానికి వచ్చిన ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా 4 ఎకరాల స్థలంలో నాలుగు కోట్ల రూపాయలతో పార్కు ఏర్పాటు చేసుకోవడం మిగతా 11 కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణంలోని అన్ని వార్డుల్లో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు, మురికి కాలువలు, ఇతరత్రా పనులను చేసుకోవడం జరుగుతుందన్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి రానున్న ఆరు నెలల్లో మరో 45 కోట్ల రూపాయల తో పనులు చేయుటకు అనుమతులు తీసుకోవడం జరిగిందని, పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం నుండి జెండా చౌరస్తా వరకు,జెండా చౌరస్తా జెండా నుండి మజీద్ వరకు అలాగే జెండా నుండి సుభాష్ విగ్రహం వరకు 75 లక్షల రూపాయలతో 40 ఫీట్లతో బిటి రోడ్డు పనులను త్వరలోనే మొదలు పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు మున్సిపల్ ఏఈ, కౌన్సిలర్లతో కలిసి రోడ్డు వెడల్పు స్థలాలను పరిశీలించి, పట్టణ ప్రజలకు వారికి అనుకూలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, మురికి కాలువలు నిర్మాణం చేయిస్తామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ , కౌన్సిలర్లు నూగిల్ల మల్లన్న, భూతగడ్డ సంపత్,పాగల సోని శ్రీకాంత్, మున్సిపల్ ఏఈ సతీష్ టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
- Advertisement -




