ప్రజాస్వామ్యంలో ఎంతో అమూల్యమైనది ఓటు హక్కు-మంథని ఆర్డీవో సురేష్
The most precious thing in a democracy is the right to vote - Manthani RDO Sureshమంథని
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని అందరూ దాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని మంథని ఆర్డీవో సురేష్ సూచించారు.
శనివారం మంథని పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలురు)లో ప్రిన్సిపల్ శ్రీనాథ్ అధ్యక్షతన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రశాంతమైన వాతావరణంలో అధికార మార్పిడి జరుగుతుందని అయన వివరించారు. 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు నిర్వహించబడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశాంస పత్రాలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మంథని తాసిల్దార్ రాజయ్య, డిప్యూటీ తాసిల్దార్ గిరి, ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ రాంబాబు, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ సరిత, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రమేష్, గురుకుల పాఠశాల/ కళాశాల సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




