స్వాతంత్ర్యం సిద్ధించాక సుక్మాలో తొలిసారి ఎగిరిన జాతీయ జెండా
సుక్మా(ఛత్తీస్‌గఢ్) ఫిబ్రవరి 19
దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుటికీ మావోయిస్టులు చెరలో ఉన్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి జాతీయ జెండా ఎగురవేయడంతో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలోని పువర్తి గ్రామంలో ఒకప్పుడు ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు ప్రభుత్వాన్ని నడిపారు. అక్కడ మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి భద్రతా బలగాలు పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.ఈ క్రమంలో భద్రతా బలగాలకు వ్యతిరేకంగా.. మావోయిస్టులు దాడులకు ప్లాన్ చేశారు. అయితే భద్రతా దళాల తనిఖీలో మావోయిస్టులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న తరువాత పోలీసులు.. గ్రామంలో జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేశారు. అలా.. సోమవారం జాతీయ జెండా ఎగురవేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛా వాయువు అందించారు. మావోయిస్టులు కూరగాయలు పండించే భూమిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాతంత్ర్యం సిద్ధించాక సుక్మాలో తొలిసారి ఎగిరిన జాతీయ జెండా

- Advertisement -
- Advertisement -



