26.1 C
New York
Wednesday, June 19, 2024

పోలీసులు వేధిస్తున్నారు

- Advertisement -

పోలీసులు వేధిస్తున్నారు
బొండా ఉమా
విజయవాడ
జగన్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులు అందరూ కమిషనర్ పరిధిలోకి వెళతారు. కానీ మన రాష్ట్రం లో అలా జరగట్లేదు. పోలీసులు నన్ను నిత్యం వేధిస్తున్నారు. నిన్న నా ఆఫీస్ ముందు 100 మంది పోలీసులు వచ్చారు. మైనర్ ను తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారు. మేము చెప్పినట్టు గా 164 స్టేట్మెంట్ ఇవ్వక పోతే మీ కొడుకు బయటకు రాడు అని ముద్దాయి సతీష్ తల్లి తండ్రి ను భయపెట్టారు. ఐఏఎస్ లు ఐపీఎస్ లు సిగ్గుతో తల దించుకోవాలి. తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి మైనర్ నీ ఇరికించారు. సెంట్రల్ నియోకవర్గ లో ఉండే దుర్గారావు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంతవరకు కోర్టు కు ఎందుకు ప్రవేశ పెట్టలేదని అన్నారు.  24 గంటలలో జడ్జి ముందు ప్రవేశ పెట్టాలని తెలియదా. రాష్ట్రం లో చట్టం అనేది ఉందా.ఎన్నికల కమిషన్ పట్టించుకోదా.. మొదటి రోజే సీబీఐ ఎంక్వైరీ వేయమని మేమే అడిగాము. గవర్నర్ ను కలసి సీబీఐ ఎంక్వైరీ వేయమని అడిగాము. జగన్ తన వ్యవస్థలను ఇప్పటికీ  తన గుప్పెట్లో పెట్టుకున్నారు. సిపి గారు మీకు కొంచమైనా నీతి,న్యాయం ఉండాలి. నాకోసం వడ్డెర గూడెం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణలో జీ హుజూర్ ఆన్న నాయకులు జైల్లో ఉన్నారు.  జూన్ 4 తర్వాత అందరి సంగతి చూస్తాను. నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని అనుకొంటే వారిని ఊరికే వదిలి పెట్టను. దుర్గారావు ను వివేకా లాగా ఏమైనా చేశారా. తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయ పోరాటానికి దిగుతానని హెచ్చరించారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!