సంచలనం సృష్టించిన ఎన్ హెచ్ 44 దారి దోపిడి కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -

సంచలనం సృష్టించిన ఎన్ హెచ్ 44 దారి దోపిడి కేసును ఛేదించిన పోలీసులు

The police cracked the sensational NH 44 road robbery case

బంగారం, 3సెల్ ఫోన్లు, 2 బైకుల స్వాధీనం
పోలీసు బృందాలను అభినందించిన ఐజి,ఎస్పీ
వనపర్తి
వనపర్తి 22-డిసెంబర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హైవే 44దారి దోపిడీ సంఘటనను సవాలుగా తీసుకున్న వనపర్తి జిల్లా పోలీసులు 2రోజుల్లో ఛేదించి శభాష్ అనిపించుకొన్నారు.
వివరాలు       మల్టీజోన్- II  ఐజి   సత్యనారాయణ, జిల్లా ఎస్పీ  రావుల గిరిధర్ వెల్లడించారు.

పిర్యాదుదారురాలు ఆమె కుటుంబ సభ్యులు ఎనిమిది మందితో కలిసి ఈనెల 13 నాడు  మారుతి ఏరిటీగా కారులో మధ్యాహ్నం తమ గ్రామం నుండి బయలుదేరి, తిరుపతి, అరుణాచలం తీర్థయాత్రలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో 18 తేదిన జు వేకువజామున 2 గం. పెబ్బేర్ గ్రామ శివారులోని NH-44 రోడ్ పై వాహనములు నిలుపుస్థలంలో తమ వాహనాన్ని నిలిపి, నిద్రపోయారు. ఉదయం 02:50 గంటల సమయంలో, గుర్తుతెలియని కొందరు వ్యక్తులు వారి కారుపై రాళ్ళతో దాడిచేసి, అర్ధాలను పగులగొట్టి, వారిని రక్తగాయాలు అయ్యేలా రాళ్ళతో కొట్టి, భయభ్రాంతులకు గురిచేసి, మహిళల మెడలలోని బంగారు పుస్తెలతాళ్లను, నల్లపూసల గొలుసులను దోపిడీ చేశారు. అంతేకాక కారుకు ఉన్న తాళములు కూడా బాక్కుని పారిపోతుంటే, తాళముల గురించి వారి వెంటపడగా, వారిపై దాడి చెసి అక్కడి నుండి పారిపోయారు. దాడి చేసినవారిలో చెరుకు రవాణా ట్రాక్టర్ల డ్రైవర్లుగా ఉన్న మరో ఇద్దరు ఏమీ ఎరగనట్టు చెరుకు ట్రాక్టర్లను తీసుకొని పారిపోవడం జరిగింది సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్  ఘటనా స్థలానికి చేరుకుని  సంఘటన స్థలాన్ని పరిశీలించి , బాధితులను పరామర్శించి,  కేసును చెడించడానికి వెంటనే  ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి.
నేరస్తులను పట్టుకోవడానికి వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్,ఐపిఎస్   పర్యవేక్షణలో,డిఎస్పీ వెంకటేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, టెక్నికల్ (ఐటి సెల్) టీం,  క్లూస్ టీంలతో టెక్మాలజి ఆధారంగా, తేది 21-12-2024 నాడు నిందితులలో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా  నిందితులు తాము చేసిన నేరమును ఒప్పుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular